ఇండిగో సంక్షోభం.. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 69 విమానాలు రద్దు.. ఎయిర్ పోర్టులో ప్రయాణికుల నరకయాతన

ఇండిగో సంక్షోభం.. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 69 విమానాలు రద్దు.. ఎయిర్ పోర్టులో ప్రయాణికుల నరకయాతన

దేశ వ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం  కొనసాగుతోంది. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులలోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రభావం హైదరాబాద్ లోని శంషాబాద్ పై కూడా పడింది. శంషాబాద్- నుంచి వెళ్లాల్సిన 69 విమాన సర్వీసులను రద్దు చేసింది ఇండిగో. దీంతో శంషాబాద్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

ఇండిగో సంక్షోభం కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన 26 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. అదే విధంగా ఇతర రాష్ట్రాలకి వెళ్లవలసిన 43 ఇండిగో విమానాలు రద్దుచేశారు ఎయిర్ లైన్స్ అధికారులు. మొత్తం 69 విమానాలను రద్దు చేసినట్టు ఇండిగో ఎయిర్లైన్స్ అధికారులు ప్రకటించారు. దీంతో ఇండిగో కౌంటర్ వద్ద ఆందోళనకు దిగారు ప్రయాణికులు.విమానాలను రద్దు చేస్తున్నట్లు ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో  ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సిబ్బందిని అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. 

ALSO READ : సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తున్నాం

DGCA నిబంధనలు విరమించుకున్నా తప్పని తిప్పలు:

దేశవ్యాప్తంగా డీజీసీఏ నిబంధనలను విరమించుకున్నప్పటికీ ఇండిగో ప్రయాణికుల తిప్పలు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా 4 వ రోజు ఇండిగో విమానాలు రద్దవడంతో ప్రయాణీకులు దేశంలోని ప్రధాన ఎయిర్ పోర్ట్ లలో ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో విమానాల సర్వీసులకు సంబంధించిన వివరాల కోసం ఇండిగో కౌంటర్ వద్దప్రయాణికులు  బారులు తీరారు.