
‘లోక చాప్టర్ 1’ మలయాళ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రూ.30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విజయం పరంపరలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 27న ) ‘లోక చాప్టర్ 2’ అనౌన్స్ చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి క్యూరియాసిటీ పెంచారు. ‘పురాణాలకు అతీతంగా. ఇతిహాసాలకు అతీతంగా. కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ‘లోక చాప్టర్ 2’ త్వరలో! అని మేకర్స్ తెలిపారు.
ALSO READ : దర్శకుడి కొడుకై.. ఇడ్లీ తినడానికి డబ్బులు లేకపోవడమేంటీ
లోకా చాప్టర్ 2 లో మలయాళ యంగ్ స్టార్ టోవినో థామస్ హీరోగా నటించనున్నారు. దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ వీడియోలో టోవినో థామస్ మైఖేల్ పాత్రలో కనిపిస్తాడని, అల్లరి స్వభావంతో ఉంటాడని వీడియో ద్వారా హింట్ ఇచ్చారు మేకర్స్. దుల్కర్ సల్మాన్ షేప్‌షిఫ్టర్/ఒడియన్, చార్లీగా కనిపిస్తాడని తెలిపారు. ఈ 2 నిమిషాల 55 సెకన్ల నిడివి గల వీడియోలో సేఫ్‌హౌస్‌లో టాడీ తాగుతున్నప్పుడు ఒకరినొకరు కలుసుకుని సరదా సీన్స్ చూపించారు.
ఈ మూవీని వేపేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించగా డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 29న రిలీజైన ఈ మూవీ తొలిరోజే పాజిటివ్ టాక్ తె చ్చుకుని సూపర్ సక్సెస్ అందుకుంది.
అయితే, లోక చాప్టర్ 2 అనౌన్స్ చేశారు కానీ, ఇప్పటికీ చాప్టర్1 ఓటీటీ అప్డేట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. దసరా స్పెషల్గా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Beyond myths. Beyond legends. A new chapter begins. #LokahChapter2
— Dulquer Salmaan (@dulQuer) September 27, 2025
Starring Tovino Thomas.
Written & Directed by Dominic Arun.
Produced by Wayfarer Films.https://t.co/2nkuQQGGKs
#Lokah #TheyLiveAmongUs@DQsWayfarerFilm @ttovino @dominicarun@NimishRavi pic.twitter.com/ISBrL8Xan0