థర్మోకోల్ పరుపులతో మెత్తని మోసం

థర్మోకోల్ పరుపులతో మెత్తని మోసం
  • థర్మోకోల్ తో పరుపుల తయారీ
  • పల్లెటూర్లే లక్ష్యంగా జోరుగా వ్యాపారం

మెత్తటి మోసం… ఇది వినటానికి కాస్త విడ్డూ రంగాఉన్నా… పేదోడి నడ్డివిరిచేమోసం. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది . పగలంతాపొలాల్లో తిరిగి రాత్రి కాస్తం త అలసట తీర్చుకునేం దుకు కొనుక్కునే పరుపుని కూడానకిలీ చేసేస్తున్నారు. పల్లెటూళ్లనే టార్గెట్ చేస్తూ సత్తు పల్లి కేంద్రంగా ఈ నకిలీపరుపుల దందా సాగుతోంది .

థర్మోకోల్ తో తయారు చేసిన నకిలీ పరుపుల వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వచ్చింది.దీంతో థర్మోకోల్ తో కూడా పరుపులు తయారు చేస్తారా అని చాలామంది వారి పరుపులను పరిశీలిం చుకునే పరిస్థితి ఏర్పడింది . ఇదంతా ఎక్కడో కాదు… ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో ఉన్న పరుపుల కంపెనీల్లో జరుగుతున్న మోసం. ముఖ్యం గా వీరు రూరల్ ప్రాంతాన్నే టార్గెట్ చేసుకొని మార్కెటిం గ్ చేస్తారు. ఇతర రాష్ట్రా ల నుంచి ఇక్కడి పరుపుల కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి థర్మోకోల్  పరుపులు తయారు చేయించుకొని తీసుకుపోతుంటారు. సత్తుపల్లిలో ఉండే కొందరు మోటార్ సైకిళ్లపై  వ్యాపారం చేసే వ్యాపారులు, గతంలో చేసిన వ్యాపారాలు మానేసి ఇప్పుడు థర్మాకోల్ పరుపుల వ్యాపారం చేస్తున్నారంటే వీటివల్ల ఎంత లాభపడుతున్నారో అర్థమవుతోంది.

ఈ నకిలీ పరుపులు తయారు చేసే కంపెనీలు ఒక్కో థర్మోకోల్ పరుపు తయారీకి రూ. 700వరకు ఖర్చు చేస్తాయి . పరుపుల తయారీకి కావాల్సిన థర్మోకోల్ ను ఆంధ్రా రాష్ట్రం భీమవరం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వారికి కావాల్సిన  సైజుల్లో ఎక్కువ మొత్తంలో లోడ్ లను కొనుగోలు చేసుకుంటారు.  కంపెనీకి వచ్చిన థర్మోకోల్ కి  పైన కింద ఒక ఇంచ్ మందం ఈపీ షీట్ పెట్టి ఆకర్షణీయమైన క్లాత్ తో కుడతారు. వీటిని వ్యాపారులకు వెయ్యి రూపాయలకు అమ్ముతారు. వాళ్లు  రూ. 1700 నుంచి రూ. 3వేల వరకు అమ్ముతారు. ఉదయాన్నే సత్తుపల్లి సెంటర్ లో టీలు, టిఫెన్ లు ముగించుకొని ఒక్కో మోటార్ సైకిల్ పై 10 నుంచి 15 పరుపులను కట్టుకొని పల్లెటూళ్లకు బయలుదేరుతుంటారు.

గతంలో గిన్నెల వ్యాపారం

మాది సత్తు పల్లిలోని జవహర్ కాలనీ. మేం గతంలో గిన్నెల వ్యాపారం చేసేవాళ్లం . వాటి ధర పెరగడంతో ఇప్పుడు పరుపుల అమ్మకాలు చేస్తు న్నాం . ఈ థర్మాకోల్ పరుపులను కంపెనీ నుంచి కొనుగోలు చేసి అమ్ముతుంటా. మొదట్లో ఈ పరుపులు గురించి కంపెనీ వారు మాకు చెప్పలేదు. మేము రూ. వెయ్యికి కొనుగోలు చేసి రూ. 1700 నుంచి రూ. 2500 వరకు అమ్ముతాం. కొంత మందికి థర్మాకోల్ అని చెబుతాం. కొందరికి చెప్పకుండానే అమ్ముతాం.– సాయి, పరుపుల వ్యాపారి

మా వ్యాపారం పడిపోయింది

సత్తు పల్లి ప్రాంతంలో రూ. 40 వేలు, రూ. 50వేలు పెట్టుబడులు పెట్టి  డబ్బులు సంపాదించేందుకు ఇలాంటి నకిలీ పరుపులు తయారు చేస్తున్నా రు. దీనివల్ల మార్కెట్ లో అసలైన పరుపుల విలువ పడిపోతోంది. ఈ థర్మాకోల్ పరుపుల అమ్మకాల వల్ల మాకు వ్యాపారం తగ్గిపోతోంది.ఇలాంటి వారి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.– పరుపుల కంపెనీ యజమాని, మౌలాలి