KINGDOM: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ ట్రైలర్ రివ్యూ.. అంచనాలు పెంచిన అంశాలివే

KINGDOM: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ ట్రైలర్ రివ్యూ.. అంచనాలు పెంచిన అంశాలివే

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. శనివారం రాత్రి (జులై26న) రిలీజైన కింగ్‌డమ్ ట్రైలర్కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్లో మంచి వ్యూస్ రాబడుతోంది. ఇందులో హీరో సత్యదేవ్, విజయ్ అన్నదమ్ములుగా నటించారు. వీళ్లిద్దరి మధ్య సాగిన ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్గా ఉన్నాయి. 

సూరి (విజయ్ దేవరకొండ) ఒక హై-రిస్క్ సీక్రెట్ ఆపరేషన్ కోసం రహస్యంగా జైలుకి వెళ్తాడు. అక్కడ శివ (సత్య దేవ్) అక్కడో గ్యాంగ్ స్టార్ ముఠాకు నాయకత్వం వహిస్తాడు. అంతేకాదు అతను దేశంలోని మోస్ట్ వాంటెడ్ నేరస్థులలో ఒకరు. తన నుంచి విడిపోయిన సోదరుడు శివ  నేతృత్వంలోని క్రైమ్ సిండికేట్‌లోకి సూరి చొరబడాలనేది ముఖ్య ఉద్దేశ్యంగా కథ ఉన్నట్లు కనిపిస్తుంది.

అయితే, ఇక్కడ ఇంట్రెస్టింగ్గా.. శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యం, అన్న శివ.. ఓ గ్యాంగ్ స్టార్, అతని మీద ప్రేమతో ఎంత దూరమైన వెళ్లే తమ్ముడిగా సూరి (విజయ్ దేవరకొండ) కనిపించడం ఆసక్తిగా మారింది. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌తో పాటు ఎమోషనల్ సీన్స్తో ఆకట్టుకుంది.ఇకపోతే, కింగ్‌డమ్ ట్రైలర్ సలార్ తరహాలో సాగిన ఫీలింగ్ అనిపిస్తుంది. సలార్‌లో ఇద్దరు స్నేహితుల మధ్య కథ నడిస్తే.. ఇది అన్నదమ్ముల మధ్య సాగే సినిమాగా ఉంది. 

టెక్నీకల్ విషయానికి వస్తే.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్తో ఆడియన్స్ ఫీల్ ఒక్కసారిగా హైపిచ్ లోకి వెళ్ళింది. ముఖ్యంగా ఇంటెన్స్గా సాగే సీన్స్లో ఎలివేట్ చేసిన మ్యూజిక్..  'కింగ్‌డమ్' సత్తా ఏంటనేది చూపిస్తోంది. ప్రస్తుతం ట్రైలర్ కట్స్లో అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సినిమాటోగ్రఫీ విభాగంలో జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ కలిసి విజువల్స్‌ను కొత్త రేంజ్‌కి తీసుకెళ్లారు. నేషనల్ అవార్డు విన్నర్ ఎడిటర్ నవీన్ నూలి మరోసారి తన మార్క్ చూపించాడు.

ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన తమ పనితీరును అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. వీరి వర్క్ ట్రైలర్ విజువల్ స్థాయిని అమాంతం పెంచింది. కథకు తగ్గట్టుగా వీరి డిజైన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫైట్ మాస్టర్స్ 'యానిక్ బెన్, చేతన్ డిసౌజా & రియల్ సతీష్' తమ యాక్షన్ కొరియోగ్రఫీతో ఆడియన్స్లో అంచనాలు పెంచారు.

ఇదిలా ఉంటే..గురువారం (జులై 31న)  కింగ్‌డమ్ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మళ్ళీరావా, జెర్సీ వంటి క్లాసిక్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి కింగ్‌డమ్ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు.