పాపం.. ఈమె యాక్సిడెంట్లో చనిపోయింది.. కట్నం పైసలు తిరిగివ్వాలని డెడ్ బాడీతో ఆందోళన

పాపం.. ఈమె యాక్సిడెంట్లో చనిపోయింది.. కట్నం పైసలు తిరిగివ్వాలని డెడ్ బాడీతో ఆందోళన

కోల్‌బెల్ట్, వెలుగు: తన కూతురు పెండ్లి సమయంలో ఇచ్చి కట్నం డబ్బులను తిరిగి ఇచ్చేయాలని ఆమె డెడ్​బాడీతో ఆందోళన చేపట్టారు. రామకృష్ణాపూర్లోని శివాజీనగర్కు చెందిన గాండ్ల సత్యం శ్రీరాంపూర్​ఏరియాలో సింగరేణి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.

కూతురు ముద్దసాని లావణ్య(29)ను తీసుకొని బైక్పై స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా ఓదెలకు బయలుదేరగా అప్పన్నపేట వద్ద లారీ ఢీట్టింది. సత్యం అక్కడికక్కడే చనిపోగా, లావణ్య తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయింది. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం రాత్రి లావణ్య డెడ్​బాడీని రామకృష్ణాపూర్కు తీసుకెళ్లారు.

లావణ్యకు, రామకృష్ణాపూర్కు చెందిన సింగరేణి కార్మికుడు ముద్దసాని సురేశ్తో నాలుగేండ్ల క్రితం పెండ్లి జరిగింది. అయితే కుటుంబ కలహాలతో కొంత కాలంగా ఆమె తల్లితండ్రుల వద్దనే ఉంటోంది. విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో ఆమె చనిపోవడంతో పెళ్లిలో ఇచ్చిన 30 తులాల బంగారం, రూ.50 లక్షల కట్నం తిరిగి ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ మృతురాలు తల్లి గాండ్ల లక్ష్మి, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

డెడ్​బాడీని సురేశ్​ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సింగరేణి ఏరియా ఆస్పత్రి వద్ద అంబులెన్స్ను అడ్డుకున్నారు. లావణ్య కుటుంబానికి రూ.20 లక్షలు ఇచ్చేందుకు సురేశ్​ఫ్యామిలీ ఒప్పుకోవడంతో వివాదం సద్దమణిగింది.