దుర్గామాత ఉత్సవాలు వాయిదా

దుర్గామాత ఉత్సవాలు వాయిదా

జనగామ అర్బన్, వెలుగు : వచ్చే నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించాలనుకున్న జనగామ విజయ దుర్గామాతా ఉత్సవాన్ని ఆక్టోబర్​ కు వాయిదా వేసినట్లు ఆలయ ప్రధాన పూజారి రాజలింగ ఆరాధ్య తెలిపారు. ఆదివారం బతకమ్మ కుంట దుర్గామాత ఆలయ ప్రాంగణంలో మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దాంతి క్రిష్ణమాచార్యులు మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణంలో   కొన్ని సంవత్సరాల కిందట నిర్మించిన శివాలయం దుర్గామాత ఆలయ సాంప్రదాయానికి ఇబ్బందిగా ఉందని, దాన్ని ప్రస్తుతం ఉన్న స్థలం నుంచి ఎల్లమ్మ దేవాలయం పక్కనే నిర్మించాలని తెలిపారు. 

విగ్రహ పునర్​ప్రతిష్టకు సమయం పడుతుందని, అందుకే ఉత్సవాలు వాయిదా వేస్తున్నట్లు   తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు పిట్టల సత్యం, మున్సిపల్​ చైర్​ పర్సన్​ పోకల జమున, ప్రధాన కార్యదర్శి వాంకుడోత్​ అనిత, పోకల లింగయ్య, కౌన్సిలర్లు గాదెపాక రాంచందర్, పేర్ని స్వరూప పాల్గొన్నారు.