మైగ్రంట్ వర్కర్‌‌గా దుర్గా మాత.. ఆకట్టుకుంటున్న అమ్మ వారి రూపం

మైగ్రంట్ వర్కర్‌‌గా దుర్గా మాత.. ఆకట్టుకుంటున్న అమ్మ వారి రూపం

కోల్‌‌‌కతా: కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌‌డౌన్ కారణంగా వలస కూలీలు తీవ్రంగా నష్టపోయారు. ఉపాధి కోల్పోయి, చేయడానికి పని లేక, వలస ప్రాంతాల్లో ఉండలేక ఎంతో మంది సొంతూళ్లకు నడుస్తూ వెళ్లారు. వేలాది మంది మైగ్రంట్ వర్కర్స్ రోడ్లపై కాలినడకన వందల కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లడాన్ని అంత సులువుగా ఎవరూ మర్చిపోలేరు. అలాంటి మైగ్రంట్ వర్కర్స్ కష్టాలు, కన్నీళ్లు, బాధలను అందరికీ గుర్తు చేసేలా బెంగాల్‌‌లో చిరు ప్రయత్నం జరిగింది.

ప్రతిష్టాత్మక దుర్గా పూజ ఉత్సవాల నేపథ్యంలో కోల్‌‌కతా, బెహలాలోని బరిషా క్లబ్ దుర్గ పూజ కమిటీ అమ్మవారిని మైగ్రంట్ వర్కర్‌‌గా రూపొందించింది. దుర్గా మాత విగ్రహాన్ని ఓ మహిళా మైగ్రంట్ వర్కర్ తన పిల్లలను ఎత్తుకొని నిలుచున్నట్లుగా తయారు చేశారు. ఉద్యోగాలు కోల్పోయి, కి.మీ.ల మేర నడుచుకుంటూ వెళ్లిన వలస కూలీల కన్నీళ్ల కథను ఇలా హృద్యంగా చెప్పడంపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.