Telangana Elections : సోషల్ మీడియా యుద్ధం ప్రారంభం

Telangana Elections : సోషల్ మీడియా యుద్ధం ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దంగల్ ను తలపిస్తున్నాయి. ఇప్పుడు అన్ని పార్టీలు సోషల్​ మీడియాపై ఫోకస్​ చేశాయి. ఒకప్పటిలా పరిస్థితి ఇప్పుడు లేదు. అన్ని పార్టీలు కూడా సోషల్​ మీడియాపై ఫోకస్​ పెట్టి... తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా రాజకీయ పార్టీల ప్రచారంలో కీలకంగా మారింది. అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయికి ఎదిగింది. సమాచారం సెకన్లలో లక్షలాది మందిని చేరుతుండటంతో ఇప్పుడు రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల వైపు చూస్తున్నాయి. 

మరోవైపు.. ఆశావహులు వారి ప్రచారానికి సంబంధించి సోషల్‌ మీడియా డెస్క్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రోజువారీ ప్రచార వివరాలు, ప్రజలతో మమేకమయ్యే సందర్భాలను సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ చేయడానికి అవగాహన ఉన్న వారిని ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నారు. వీడియోలను రూపొందించి షేర్‌ చేయడానికి వీడియో ఎడిటర్లు, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు, కంటెంట్‌ రైటర్లను నియమించుకుంటున్నారు.

Also Read : కదులుతున్న రైలు మీదికి విసిరారు.. చేయి, కాళ్లు కోల్పోయిన నీట్ విద్యార్థిని

ఇప్పటికే అభ్యర్థులు ఫేస్‌బుక్‌, ఎక్స్‌(ట్విట్టర్‌), యూట్యూబ్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌ చానెల్‌ ల వేదికగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు తమకు మద్దతుగా ప్రచారం చేయాలని అత్యధికంగా ఫాలోవర్స్‌ ఉన్న పేజీ నిర్వాహకులను సంప్రదిస్తున్నారు. లక్ష సబ్‌స్ర్కైబర్స్‌ ఉన్న యూట్యూబ్‌ పేజీకి ఓ ధర, ఆ పై ఉన్న పేజీలకు ఓ ధరను నిర్ణయిస్తూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. 

ఇప్పటికే సోషల్​ మీడియాలో పొలిటికల్​ పార్టీల మధ్య వార్ మొదలైంది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత, అధికార పార్టీ ప్రతినిధి దాసోజు శ్రావణ్​ చేసిన ట్వీట్​ తో సోషల్​ మీడియా లో వార్ మొదలైంది. రేవంత్​ రెడ్డి పట్ల జాగ్రత్త వహించండి.. తెలంగాణ భవిష్యత్తులో ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ దాసోజు శ్రావణ్​ ట్వీట్​ చేయడం పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యే టికెట్లను తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డి అమ్ముకుంటున్నారని ట్విట్టర్​ వేదికగా దాసోజు ఆరోపించారు. టికెట్ల కోసం సొంత పార్టీ నేతలనే దోచుకుంటుంటే.. రేపు పొద్దున్న కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు.