డ్యూరోఫ్లెక్స్​ బ్రాండ్​ అంబాసిడర్​గా కోహ్లీ

డ్యూరోఫ్లెక్స్​ బ్రాండ్​ అంబాసిడర్​గా కోహ్లీ

హైదరాబాద్​, వెలుగు: పరుపులు అమ్మే డ్యూరోఫ్లెక్స్ తన ప్రొడక్టుల ప్రచారం కోసం క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీని బ్రాండ్​ అంబాసిడర్​గా నియమించుకుంది.  డ్యూరోఫ్లెక్స్‌‌‌‌‌‌‌‌కు బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా చేరడంపై ఈ క్రికెటర్​ మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నిద్ర కీలకమని, నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కెరీర్‌‌‌‌‌‌‌‌లో విజయాలు సాధించవచ్చని, సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన ‘న్యూమా’ పరుపును కూడా లాంచ్​ చేశారు. వివిధ నిద్ర విధానాలకు, శరీర భంగిమలకు, ఆరోగ్యానికి తగినట్లుగా ఈ పరుపును మార్చుకోవచ్చు. సంస్థ సీఎండీ మాథ్యూ చాందీ మాట్లాడుతూ ‘‘దక్షిణాదిలో మేం మార్కెట్​ లీడర్లం! మా మార్కెట్​ వాటా 20 శాతం వరకు ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. వెయ్యి కోట్ల టర్నోవర్​ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  ఇది 25 శాతం పెరుగుతుందని భావిస్తున్నాం.

ప్రస్తుతం మాకు 60 సొంత స్టోర్లు ఉన్నాయి. మరికొన్ని నెలల్లో వీటి సంఖ్య వందకు పెంచుతాం. ఫ్రాంచైజీ విధానంలో 900 స్టోర్లు ఉన్నాయి. వీటిని వెయ్యికి చేర్చుతాం. మనదేశ పరుపుల మార్కెట్​ సైజు (ఆర్గనైజ్డ్​) రూ. ఐదు వేల కోట్ల వరకు ఉంటుంది. మా ప్రొడక్టుల ధరలు రూ.ఎనిమిది వేల నుంచి రూ.లక్ష వరకు ఉన్నాయి. మేం పరుపులతోపాటు సోఫాలు, ఫోం ప్రొడక్టులను కూడా తయారు చేస్తున్నాం. మాకు హైదరాబాద్​లోనూ ప్లాంటు ఉంది”అని ఆయన వివరించారు.