కాటాలన్ లో లూసీగా దుషార విజయన్ యాక్షన్ మోడ్

కాటాలన్ లో లూసీగా దుషార విజయన్ యాక్షన్ మోడ్

కోలీవుడ్‌‌‌‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న దుషార విజయన్.. ‘కాటాలన్’ అనే  హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌తో  మాలయళ ఎంట్రీ ఇస్తోంది.  మలయాళ స్టార్ ఆంటోనీ వర్గీస్ హీరోగా  నటిస్తున్న ఈ చిత్రానికి పాల్ జార్జ్  దర్శకత్వం వహిస్తున్నాడు.  తాజాగా ఈ చిత్రం నుంచి దుషార విజయన్ ఫస్ట్ లుక్‌‌‌‌తోపాటు తన పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో  ఆమె  ‘లూసీ’  అనే పవర్‌‌‌‌ఫుల్ పాత్రలో కనిపించనుందని రివీల్ చేశారు.  

చేతిలో గన్ పట్టుకుని, శత్రువులపై గురిపెట్టి కనిపించిన దుషార లుక్  ఆకట్టుకుంటోంది.  ‘వేటకు సిద్ధమవ్వండి’ అని  ఈ పోస్టర్‌‌‌‌కు క్యాప్షన్ ఇవ్వడం తన పాత్రపై ఆసక్తిని  పెంచుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్‌‌‌‌తోపాటు కబీర్ దుహాన్ సింగ్, సిద్ధికీ కీలక పాత్రలు పోషించారు. మే 28న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల  కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించాడు.