
గ్రేటర్ సిటీలో దసరా నవరాత్రి వేడుకలు సంబురంగా సాగుతున్నాయి. బుధవారం మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లో ‘నవరాత్రి నవరంగ్’ పేరుతో హమ్స్ టెక్ కాలేజీ ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహించగా.. యువత ఉత్సాహంగా పాల్గొని దాండియా ఆడారు. ఆటపాటలతో అదరగొట్టారు. ఐఎస్వో ఇనిస్టిట్యూట్ స్టూడెంట్లు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
మాదాపూర్ శిల్పారామంలో సాయికృష్ణ తాడేపల్లి శిష్యబృందం కూచిపూడి ప్రదర్శనతో సందర్శకులను మెప్పించారు. అంబర్ పేటలోని సీఎఆర్ హెడ్ క్వార్టర్స్ లో రాచకొండ మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది బతుకమ్మ ఆడారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు.
– వెలుగు, ఫొటోగ్రాఫర్/ముషీరాబాద్/మాదాపూర్