
ఓ వైపు పాలిటిక్స్, మరోవైపు వరుస సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నారు పవన్ కళ్యాణ్(Pawan kalyan). ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రస్తుతం రాజకీయాలపైనే ఆయన ఫోకస్ పెట్టారు. దీంతో పవన్ ప్రాజెక్టులపై టాలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయి. సుజీత్ డైరెక్షన్‌లో ఆయన నటిస్తున్న ఓజీ సినిమా నుంచి నిర్మాతలు తప్పుకున్నారని, వేరే ప్రొడక్షన్ హౌస్ చేతికి ఈ మూవీ వెళ్లనుందనే ప్రచారం జరుగుతోంది. వీటికి చెక్ పెడుతూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఇదంతా ప్రచారమేనని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.
ఓజీ మనది.. ఓజీ ఎప్పటికీ మనదే అంటూ పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతుందో తమకు పూర్తి క్లారిటీ ఉందన్నారు. అలాగే ‘ఆకలి ఎక్కువ కాలం ఉంటుంది, కానీ చిరుత వేట ఏమీ వదిలిపెట్టదు’ అంటూ సినిమా ఆలస్యమైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ ఆసక్తిని పెంచింది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు . తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో పాటు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ చిత్రాలను పవన్ పూర్తి చేయాల్సి ఉంది.