సెల్లర్లకు ఫీజు తగ్గించిన అమెజాన్​

సెల్లర్లకు ఫీజు తగ్గించిన అమెజాన్​

హైదరాబాద్​, వెలుగు: ఫెస్టివల్ ​సీజన్ ​నేపథ్యంలో తమ అమ్మకందారులకు రెఫరల్​ ఫీజును 50 శాతం తగ్గించామని ఈ–కామర్స్​ కంపెనీ అమెజాన్​ ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి నవంబర్ 4, 2023 మధ్యలో  చేరే కొత్త సెల్లర్లకు ఈ మినహాయింపు ఉంటుంది.   కొత్త సెల్లర్లను ఎంతో ప్రోత్సహిస్తున్నామని, కస్టమర్ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించడంలో వారికి సహాయపడుతున్నామని సంస్థ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు.  

సెల్లర్లు తమ స్నేహితులను అమెజాన్​లో చేర్పించి రూ.11,500 వరకు విలువైన రివార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పొందవచ్చు.  కొత్త సెల్లర్ల కోసం శిక్షణ  కార్యక్రమాలు, ఇన్సెంటివ్స్, వర్కింగ్​ క్యాపిటల్​ లోన్లు​ ఇస్తున్నామని  అమెజాన్ ఇండియా  సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ డైరెక్టర్ అమిత్ నందా చెప్పారు. తెలంగాణ  నుంచి  తమకు 50 వేల మంది సెల్లర్లు ఉన్నారని చెప్పారు.  ఇక్కడే దాదాపు 70  పార్టనర్ డెలివరీ స్టేషన్లు,  1800 లకు పైగా 'ఐ హావ్ స్పేస్' స్టోర్లు, ఆరు ఫుల్‌‌‌‌ఫిల్‌‌‌‌మెంట్‌‌‌‌  సెంటర్లు,  ఒక సార్టేషన్ సెంటర్​ ఉందని చెప్పారు.