IT Layoffs : ఈబే.. వెయ్యి మందిని తీసేసింది

IT Layoffs : ఈబే.. వెయ్యి మందిని తీసేసింది

లేఆఫ్ అనే మాట ఇప్పుడు ఐటీ కంపెనీలలో చాలా సర్వసాధారణంగా మారిపోయింది. ఉద్యోగుల తొలగింపుకు దిగ్గజ సంస్థలు వెనుకాడటంలేదు.  గతేడాది చాలా టెక్ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలిగించింది. ఈ ఏడాది కూడా  లేఆఫ్ లు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్  1000 మంది ఉద్యోగులును తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. 

తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈబే లేఆఫ్ ప్రకటించింది. వెయ్యి మంది ఉద్యోగులను  ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే నెలల్లో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లను కూడా తొలిగించనున్నట్లుగా ఈబే ప్రెసిడెంట్, సీఈవో జామీ ఇయానోన్ వెల్లడించారు.  గత త్రైమాసికంలో US డాలర్ 1.3 బిలియన్ల లాభాన్ని నమోదు చేసినప్పటికీ ఈబే మార్పు అవసరమని పేర్కొంటూ వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 

1995లో అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థాపించబడిన ఈబే ఈకామర్స్ అమ్మకాలు, కొనుగోలు ప్లాట్ ఫామ్ గా ఉంది. ఎలక్ట్రానిక్స్,ఫ్యాషన్ ప్రొడక్ట్స్ నుంచి గిఫ్టు ఆర్టికల్స్ తో పాటు అనేక రకాల ఉత్పత్తులు ఈబేలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి.