వచ్చే ఏడాది నుంచి అందరికీ ఈ-పాస్ పోర్ట్

వచ్చే ఏడాది నుంచి అందరికీ ఈ-పాస్ పోర్ట్

ప్రాసెస్‌ను ప్రారంభించిన కేంద్రం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి ఇండియన్ సిటిజన్లు అందరికీ ఎలక్ట్రానిక్ పాస్ పోర్టులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఐటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేసే ఏజెన్సీని ఎంపిక చేసేందుకు కేంద్రం ప్రాసెస్ ను ప్రారంభించింది. ఈ ప్రాసెస్ పూర్తయితే వచ్చే ఏడాది ప్రారంభం నుంచే ఇండియన్ సిటిజన్లకు ఈ -పాస్ పోర్టుల ‌‌‌‌‌‌‌‌‌‌‌‌జారీ మొదలవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సిటిజన్లకు పాస్ పోర్టులను బుక్ లెట్లపై ప్రింట్ చేసి ఇస్తున్నారు. ఇప్పటివరకు కేంద్ర అధికారులు, డిప్లమాట్స్ కు మాత్రం 20 వేల ఈ-పాస్ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ట్రయల్ ప్రాతిపదికన జారీ చేశారు. వీటిని ఎలక్ట్రానిక్ మైక్రోప్రాసెసర్ చిప్ ను జోడించి తయారు చేశారు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) స్టాండర్డ్స్ తో తయారు చేసే ఈ పాస్ పోర్టులను ఫోర్జరీ చేయడం అంత ఈజీ కాదని చెప్తున్నారు. వీటితో ఇమిగ్రేషన్ చెకింగ్స్ సమయంలో ప్యాసింజర్లను వేగంగా తనిఖీ చేసేందుకు కూడా వీలవుతుందని అంటున్నారు.

For More News..

చికెన్‌ ముక్కలపై కరోనా..

ప్రధానిగా మోడీ కొత్త రికార్డు