GHMC పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడు పూటల భోజనం

GHMC పరిధిలోని 18 ప్రభుత్వ  ఆస్పత్రుల్లో మూడు పూటల భోజనం

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో 18ప్రభుత్వ హాస్పిటల్లో మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రతిరోజూ సుమారు 20 వేల మంది 18 హాస్పిటల్స్ లో భోజనం చేస్తారని చెప్పారు. హరే రామ హరే కృష్ణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఒక్కో ప్లేట్ మీద రాష్ట్ర ప్రభుత్వం రూ.21 ఖర్చు చేస్తోందన్నారు. త్వరలోనే నైట్ షెల్టర్ లు అందుబాటులోకి వస్తాయన్నారు. వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఉస్మానియాలో 40 ఐసీయూ బెడ్స్ ప్రారంభించామని, మరో 30 త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. అన్ని విధాలుగా ఉస్మానియా ఆస్పత్రిని డెవలప్ చేస్తామని, రోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉస్మానియాలో కొత్త బిల్డింగ్ కట్టేందుకు కమిటీ వేశామని, హెరిటేజ్ బిల్డింగ్ తో సంబంధం లేకుండా త్వరలోనే కొత్త బిల్డింగ్ నిర్మిస్తామని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో పురుగులు పట్టిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఇచ్చేవారని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం అందిస్తున్నామని అన్నారు. తెలంగాణలో మాత్రమే బీసీ, ఎస్సీ హాస్టల్స్ లలో సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నామన్నారు. వృద్దులకు రూ.2016పెన్షన్ ఇస్తున్నామన్నారు. పెళ్లి సమయంలో ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలు తీసుకొచ్చామన్నారు. ఆస్పత్రుల్లో పేషెంట్లకు డైట్ చార్జ్ కూడా పెంచామని చెప్పారు. 

రూ.5కే భోజనం : హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ సహాయకులకు టిఫిన్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు, వారి సహాయకులు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారని, వీరంతా కేవలం రూ.5కే భోజనం చేయవచ్చన్నారు.

మరిన్ని వార్తల కోసం..

నార్త్ కొరియాలో రెండేళ్ల తర్వాత తొలి కరోనా కేసు

దేశంలో కొత్తగా 2, 827 కరోనా కేసులు