నేడు ఎంసెట్, ఈసెట్ ఫలితాలు

నేడు ఎంసెట్, ఈసెట్ ఫలితాలు
  • రిలీజ్ చేయనున్న మంత్రి సబితారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఎంసెట్, ఈసెట్ ఫలితాలు శుక్రవారం రిలీజ్ కానున్నాయి. జేఎన్టీయూహెచ్‌‌లో ఉదయం 11.15 గంటలకు టీఎస్ ఎంసెట్, 11.45కు టీఎస్ఈసెట్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి విడుదల చేయనున్నట్టు ఆయా సెట్స్ కన్వీనర్లు గోవర్ధన్, విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎంసెట్ ఫలితాలు https://eamcet.tsche.ac.inలో, ఈసెట్ ఫలితాలు https://ecet.tsche.ac.inలో పెడ్తామని చెప్పారు.