18 నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు

18 నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
  • నేటి నుంచి 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  • 24న సీట్ల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ఎంసెట్​ కౌన్సెలింగ్ షెడ్యూల్ మారింది. సోమవారం నుంచే మొదలుకావాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను.. ఈ నెల 18 నుంచి 22 వరకు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం కొత్త షెడ్యూల్​ను టెక్నికల్ ఎడ్యుకేషన్​ కమిషనర్ నవీన్ మిట్టల్ రిలీజ్ చేశారు. ఇప్పటికే మొదలైన ఆన్​లైన్  డిటెయిల్స్ ఫిల్లింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్  స్లాట్ బుకింగ్​ గడువును 19 వరకు పెంచారు. స్లాట్ బుక్  చేసుకున్నవారికి ఈ నెల12 నుంచి 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ ఉంటుంది. 18 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు తీసుకుని.. 24న ఫస్ట్​ఫేజ్​ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన స్టూడెంట్లు 28లోగా ఆన్​లైన్​లో సెల్ఫ్​రిపోర్టింగ్ చేయాలి. 29 నుంచి నవంబర్​ 5 వరకు సెకండ్ ఫేజ్​అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఈ ఫేజ్​కు సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ స్లాట్ బుకింగ్ ఈనెల 29న, 30న వెరిఫికేషన్​ఉంటాయి. 30, 31తేదీల్లో వెబ్​ ఆప్షన్లు  స్వీకరించి.. నవంబర్ 2న సీట్లు కేటాయిస్తారు.

సీట్లకు అనుమతి రాక..

ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు రాష్ట్ర సర్కా రు అనుమతి ఇవ్వకపోవడంతోనే అడ్మిషన్​షెడ్యూల్​లో మార్పులు చేయాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. కాలేజీలకు అనుమతిపై రెండు నెలల కిందే జేఎన్టీయూ ప్రతిపాదనలు పంపి నా.. ఇప్పటికీ స్పందన లేదు. కొత్త కోర్సులకు అనుమతి, సీట్ల పెంపుపై సర్కారు గైడ్ లైన్స్​ఇవ్వాల్సి ఉంది.