V6 News

ఎర్త్ డే(Earth Day)..ఇప్పుడు భూమిని కాపాడుకోకపోతే.. భవిష్యత్తు ప్రశ్నార్థకమే!

ఎర్త్ డే(Earth Day)..ఇప్పుడు భూమిని  కాపాడుకోకపోతే.. భవిష్యత్తు ప్రశ్నార్థకమే!

మానవుడు సౌకర్యం కోసమో... నిర్లక్ష్యంతోనే చేసే కొన్ని పనులు వల్లే ప్రకృతి అతలాకుతలం అవుతోంది. పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ఆ ప్రభావం భూమిపై ఉన్న అన్ని జీవులపై పడుతోంది. ఇప్పుడు కూడా భూమిని కాపాడుకోకపోతే భవిష్యమానవుడు సౌకర్యం కోసమో... నిర్లక్ష్యంతోనే చేసే కొన్ని చనులు వల్లే ప్రకృతి అతలాకుతలం అవుతోంది. పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ఆ ప్రభావం భూమిపై ఉన్న అన్ని జీవులపై పడుతోంది. ఇప్పుడు కూడా భూమిని కాపాడుకోకపోతే భవిష్యత్ లో ఎనో  సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది 

చక్రంతో మొదలైన అభివృద్ధి రోజుకూ పెరుగుతోంది. దాంతో వనరుల వినియోగం కూడా బాగా పెరిగింది. ఇంధనాల కోసం అనేక రకాలుగా భూమిని గుల్ల చేస్తున్నాం. వాహనాలు ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగతో వాతావరణం వేడెక్కుతోంది. ఎండాకాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఇకాల వర్గాలు కురవడం, అవసరం ఉన్న సమయంలో కురవకపోవడం, అధిక ఉష్ణోగ్రతతో ముందు కరిగి సముద్ర మట్టాలు పెరగడం. అడవులు అంతరించి పోవడం లాంటి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ప్రకృతి నాశనం అవుతోంది. అనేక వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి. 

ఇవేగాక గుట్టలను హరిస్తున్నాడు. ఇన్ని విపత్కర పరిణామాలు వాతావరణాన్ని కాలుష్యం బారిన పడేలా చేస్తున్నాయి. దాంతో నీటి వనరులు హరించడమే కాకుండా స్వచ్ఛమైన నీరు, గాలి ఆఖరికి జెనే తిండి కూడా కలుషితమవుతోంది అలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే ఇకనైనా జాగ్రత్త పడాలి. భూమిని కాపాడుకోవాలి. మనం చేసే కొన్ని పనుల వల్ల భూమికి ముప్పు వాటిల్లుతోంది. పారిశ్రామిక ప్రగతి కోసం ఖనిజాల వేటలో భూమిని కొల్లగొట్టడంతో తీరని నష్టం జరుగుతోంది. బొగ్గు, ఇనుము తదితర ఖనిజాలను ఇష్టం వచ్చినట్లు తవ్వి తీస్తుండడంతో భూమి సమతుల్యతకు ఆటంకం కలుగుతోంది. 

ఎలక్ట్రానిక్, పాస్టిక్ వస్తువుల వినియోగం పెరిగి భూమిపై: వ్యర్థాలు పేరుకుంటున్నాయి. దీంతో పర్యావరణం దెబ్బ తినడంతోపాటు వాతావరణ అసమతుల్యత ఏర్పడుతోంది. ప్రకృతిలో అనేక మార్పులు వస్తుండడంతో ఆకాల వర్గాలు వర్గాలు, తుపానులు, సునామీలు, భూకంపాలు సంభవిస్తున్నాయి. మనిషి చేసే కొన్ని పనుల వల్ల సమస్త జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.

ఎప్పటి నుంచి?

అమెరికా పార్లమెంట్ సభ్యుడు గేలార్జ్ నెల్సన్ భూమిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను 1970లో గుర్తించారు.ఏప్రిల్ 22ను 'ఎర్త్ డే'గా పాటించాలని పిలుపునిచ్చారు. ఆయన స్పూర్తితో ఇప్పటి ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు. యూథాంట్ అధికారకంగా వెర్త్ 20 నిర్వహించాలని ఆదేశించాడు. దాంతో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఇది తర్వాత కాలంలో అన్ని దేశాలకు విస్తరించింది.స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ఈ దినోత్సవాన్ని జరుపుతున్నాయి. 

వాతావరణ మార్పులు వల్ల ఉత్పన్నమయ్యే ప్రతికూల పరిస్థితులపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడమే ఎక్స్రే ఉద్దేశం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 192వేశాల్లో ఎర్త్ డే నిర్వహిస్తున్నారు. 150కోట్ల ప్రజలు వందులో పాల్గొంటున్నారు. 22వేల స్వచ్ఛంద సంస్థలు ములకు అవగాహన కల్పిస్తున్నాయి

భూమిని కాపాడుకోవడానికి ఏం చేయాలి

  • వ్యర్థాలను రీసైకిల్ చేసే దిశగా కృషి చేయాలి.
  • ఇన్ని కళాశాలలు, విశ్వ విద్యాలయాలు, పాఠశాలల్లో పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి..
  • గ్రామాల్లో చెరువుల పరిరక్షణ మొక్కలను పెంచడం. అంతరించిపోతున్న వృక్ష, ఇంతుజాతులను కాపాడుకోవడంపై అవగాహన కల్పించా.
  • పర్యావరణ పరిరక్షణలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషించాలి. విద్యార్థులకు: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలి.
  • పట్టణ ప్రాంతమైనా, నా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి.
  • దాబోయే ప్రమాదం నుంచి మానవాళిని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందన్న విషయం గ్రహించాలి