ఢిల్లీలో భూకంపం.. 2 నిమిషాల పాటు కంపించిన భూమి

ఢిల్లీలో భూకంపం.. 2 నిమిషాల పాటు కంపించిన భూమి

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని భూకంపం వణికించింది. సుమారు రెండు నిమిషాల పాటు ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రకంపనలకు ఇండ్లల్లో వస్తువులు కిందపడడం, ఫ్యాన్లు ఊగడంతో బయటకు పరుగులు పెట్టారు. భారీ భవంతుల్లో నివసించే వారు పిల్లాపాపలను ఎత్తుకుని ఆరుబయట ప్రాంతాలకు చేరుకున్నారు. ఉన్నట్టుండి అపార్ట్​మెంట్​ఊగడంతో ఉరుకులుపరుగులు పెడుతూ పదకొండు అంతస్తుల మెట్లు దిగానని ఓ యువతి ట్విట్టర్ లో ఫొటోలు షేర్ చేసింది. ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని సమాచారం. ట్విట్టర్ లో ఎర్త్​ క్వేక్ యాష్ ట్యాగ్​ వైరల్​ అయింది. తమ ఏరియాలోని  పరిస్థితిని ఫొటోల ద్వారా షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు.  

కాగజ్​నగర్​లో కూడా..
కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌, కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లో మంగళవారం ఉదయం 8:40 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. చిన్న శబ్దంతో కుదుపునకు గురైంది. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4 గా నమోదైంది. సిర్పూర్ టీ కి 8 కిలోమీటర్ల దూరంలో భూకంపం నమోదైంది.