
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఇవాళ ఉదయం స్వల్ప భూకంపం వచ్చింది. భూకంప తీవ్రతకు ముంబైలోనూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 11 గంటలకు పాల్ఘడ్ జిల్లాలోని దహను పట్టణంలో భూమి కంపించినట్టు తెలిపారు అధికారులు. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. ఈ ఘటనలో జరిగిన నష్టంపై ఇంకా సమాచారం లేదు.