ఢిల్లీలో భూ ప్రకంపనలు

ఢిల్లీలో భూ ప్రకంపనలు

నేపాల్ లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత5.8గా నమోదైంది. నేపాల్ లో భూకంపం ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలో కనిపించింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. నేపాల్ లో వచ్చిన భూకంపం ఢిల్లీలో ప్రకంపనలకు కారణమని అధికారులు గుర్తించారు. భూ ప్రకంపనల కారణంగా జనం భయాందోళనకు గురయ్యారు. భూ ప్రకంపనల కారణంగా ఇంట్లోని వస్తువులు కదులుతున్న  దృశ్యాలను కొందరు వీడియోలు తీయగా అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.