గో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చిన ఈజ్‌‌‌‌‌‌‌‌మైట్రిప్‌‌‌‌‌‌‌‌ సీఈఓ నిషంత్‌‌‌‌‌‌‌‌ పిట్టీ

గో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చిన ఈజ్‌‌‌‌‌‌‌‌మైట్రిప్‌‌‌‌‌‌‌‌ సీఈఓ నిషంత్‌‌‌‌‌‌‌‌ పిట్టీ

న్యూఢిల్లీ :  గో ఎయిర్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేయడానికి మూడు నెలల కిందట బిడ్స్ వేసిన ఈజ్‌‌‌‌‌‌‌‌మైట్రిప్ సీఈఓ నిషంత్ పిట్టీ, తాజాగా తన బిడ్స్‌‌‌‌‌‌‌‌ను విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకున్నారు. పిట్టీకి మెజార్టీ వాటాలు ఉన్న బిజీ బీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌, స్పేస్‌‌‌‌‌‌‌‌జెట్ చీఫ్ అజయ్‌‌‌‌‌‌‌‌ సింగ్ కలిసి  దివాలా ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కొంటున్న  గో ఎయిర్ (గతంలో గో ఫస్ట్‌‌‌‌‌‌‌‌) కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో  బిడ్స్‌‌‌‌‌‌‌‌ వేశారు. బిడ్‌‌‌‌‌‌‌‌ను విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకోవడం తన సొంత నిర్ణయమని, బాగా ఆలోచించాక ఈ నిర్ణయం తీసుకున్నానని పిట్టీ పేర్కొన్నారు.  

54 విమానాలను తిరిగి తీసుకునేందుకు  గో ఫస్ట్‌‌‌‌‌‌‌‌కు లీజుకు ఇచ్చిన కంపెనీలకు ఢిల్లీ హై కోర్టు నెల కిందట అనుమతి ఇచ్చింది. కోర్టు ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి తన ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మార్పులు చేస్తానని కిందటి నెల 26 న పిట్టీ పేర్కొన్నారు. కాగా, అజయ్‌‌‌‌‌‌‌‌ సింగ్ తన బిడ్‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. గో ఫస్ట్ ఇన్‌‌‌‌‌‌‌‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేయడానికి జూన్ 3 వరకు డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ను ఎన్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌టీ పొడిగించింది.

గతంలో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 4 డెడ్‌‌‌‌‌‌‌‌లైన్. కాగా, ప్రాట్‌‌‌‌‌‌‌‌ అండ్ విట్నీ సప్లయ్ చేసిన ఇంజిన్లలో లోపాలు ఉండడంతో గో ఫస్ట్ దివాలా తీసింది.  కిందటేడాది మే 3 న  తన సర్వీస్‌‌‌‌‌‌‌‌లను ఆపేసింది. మే 10 న ఎన్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌టీకి దివాలా కోసం వెళ్లింది. అజయ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, బిజీ బీ  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌తో పాటు షార్జా బేస్డ్‌‌‌‌‌‌‌‌ స్కై వన్‌‌‌‌‌‌‌‌ ఎప్‌‌‌‌‌‌‌‌జెడ్‌‌‌‌‌‌‌‌ఈ కూడా గో ఫస్ట్ కోసం బిడ్‌‌‌‌‌‌‌‌ వేసింది.