మొంథా తుఫాన్ ఎఫెక్ట్: విశాఖ మీదుగా వెళ్లే 43 రైళ్లు రద్దు..

మొంథా తుఫాన్ ఎఫెక్ట్: విశాఖ మీదుగా వెళ్లే 43 రైళ్లు రద్దు..

మొంథా తుఫాన్ ఏపీలో దడ పుట్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడి తుఫానుగా మారడంతో పలు జిల్లాలకు మూడురోజులపాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో విశాఖ మీదుగా వెళ్లే 43 రైళ్లను  రద్దు చేస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది రైల్వే శాఖ. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విశాఖ మీదుగా వెళ్లే 43 రైళ్లను మూడురోజుల పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపింది రైల్వే శాఖ. 

మంగళ, బుధ, గురువారం ( అక్టోబర్ 27, 28, 29 ) విశాఖ మీదుగా పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ.మొంథా తుఫాన్ హెచ్చరికలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది రైల్వే శాఖ.  మూడురోజుల పాటు రద్దు చేసిన రైళ్ల జాబితాను విడుదల చేసింది రైల్వే శాఖ. ఈ క్రమంలో ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు ట్రైన్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది రైల్వే శాఖ. తుఫాను తీవ్రతను బట్టి రైళ్లను పునరుద్ధరిస్తామని తెలిపింది రైల్వే శాఖ.

రద్దైన పలు ప్రధాన రైళ్లు ఇవే:

  • 67286 విశాఖపట్నం - రాజమండ్రి మెమూ అక్టోబర్ 28, 2025న విశాఖపట్నం నుండి బయలుదేరాల్సిన రైలు
  • 7268 విశాఖపట్నం - కాకినాడ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 28, 2025న విశాఖపట్నం నుండి బయలుదేరాల్సిన రైలు
  • 17267 కాకినాడ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 28, 2025న కాకినాడ నుండి బయలుదేరాల్సిన రైలు
  • 08583 విశాఖపట్నం - తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 27, 2025న విశాఖపట్నం నుండి బయలుదేరాల్సిన రైలు
  • 08584 తిరుపతి - విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 28, 2025న తిరుపతి నుండి బయలుదేరాల్సిన రైలు
  • 22875 విశాఖపట్నం - గుంటూరు డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 28, 2025న విశాఖపట్నం నుండి బయలుదేరాల్సిన రైలు
  • 22876 గుంటూరు - విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 28, 2025న గుంటూరు నుండి బయలుదేరాల్సిన రైలు
  • 17244 రాయగడ - గుంటూరు ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 27, 2025న రాయగడ నుండి బయలుదేరాల్సిన రైలు
  • అక్టోబర్ 27, 2025న విశాఖపట్నం నుండి బయలుదేరాల్సిన ట్రైన్ నెం. 12861 విశాఖపట్నం - మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
  • అక్టోబర్ 28, 2025న మహబూబ్‌నగర్ నుండి బయలుదేరాల్సిన ట్రైన్ నెం. 12862 మహబూబ్‌నగర్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 
  • అక్టోబర్ 27, 2025న విశాఖపట్నం నుండి బయలుదేరాల్సిన ట్రైన్ నెం. 22869 విశాఖపట్నం - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
  • అక్టోబర్ 28, 2025న ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరాల్సిన ట్రైన్ నెం. 22870 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్
  • అక్టోబర్ 27, 2025న విశాఖపట్నం నుండి బయలుదేరాల్సిన ట్రైన్ నెం. 12739 విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్
  • అక్టోబర్ 27, 2025న విశాఖపట్నం నుండి బయలుదేరాల్సిన ట్రైన్ నెం. 20805 విశాఖపట్నం - న్యూఢిల్లీ ఏపీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  • అక్టోబర్ 29, 2025న న్యూఢిల్లీ నుండి బయలుదేరాల్సిన ట్రైన్ నెం. 20806 న్యూఢిల్లీ - విశాఖపట్నం ఏపీ ఎక్స్‌ప్రెస్
  • అక్టోబర్ 27, 2025న విశాఖపట్నం నుండి బయలుదేరాల్సిన ట్రైన్ నెం. 22707 విశాఖపట్నం - తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
  • అక్టోబర్ 27, 2025న విశాఖపట్నం నుండి బయలుదేరాల్సిన ట్రైన్ నెం. 18519 విశాఖపట్నం - ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ 
  • అక్టోబర్ 29, 2025న ఎల్‌టీటీ నుండి బయలుదేరాల్సిన ట్రైన్ నెం. 18520 ఎల్‌టీటీ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
     

 

ఇదిలా ఉండగా.. మొంథా తుఫాను క్రమక్రమంగా బలపడుతున్న క్రమంలో ఏపీలోని కోస్త జిల్లాలపై తుఫాను ప్రభావం మొదలైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కుడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ ప్రభావం మరింత పెరుగుతుందని తెలిపింది వాతావరణ శాఖ. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది వాతావరణ శాఖ.