వెయిట్‌‌‌‌ లాస్‌‌‌‌కు డైటింగ్‌‌‌‌ చేస్తున్నారా.? జర జాగ్రత్త.!

V6 Velugu Posted on Feb 18, 2021

ఆరోగ్యంగా ఉండాలని, సన్నగా నాజూకుగా కనిపించాలని డిఫరెంట్‌‌ డైట్స్‌‌ ఫాలో అవుతుంటారు చాలామంది. బరువు తగ్గాలంటే తిండిని కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేస్తే సరిపోతుందని అనుకుంటారు. దానివల్ల కొన్ని లాభాలున్నా.. ఇబ్బందులు ఎక్కువే అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌.

శరీరానికి అన్ని పోషకాలూ అందాలి. కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్‌‌‌‌‌‌‌‌ తక్కువగా తీసుకోవడం వల్ల హెల్త్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి. అందుకే డైటింగ్‌‌ చేస్తున్నప్పుడు బ్యాలెన్స్డ్​​ ఫుడ్‌‌ తినాలి.

మజిల్‌‌‌‌‌‌‌‌మాస్‌‌‌‌‌‌‌‌ తగ్గిపోతుంది

డైటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తే సహజంగా బరువు తగ్గుతారు. కానీ సరైన పద్ధతిలో చేయకపోతే బరువు పెరుగుతారని రీసెర్చ్‌‌‌‌‌‌‌‌లు చెప్తున్నాయి.  అమెరికన్‌‌‌‌‌‌‌‌ జర్నల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ క్లినికల్‌‌‌‌‌‌‌‌ న్యూట్రిషన్‌‌‌‌‌‌‌‌ 32 మంది లావు లేని మగవాళ్ల మీద ఈ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ చేసింది. వాళ్లకు దాదాపు మూడు వారాలపాటు 1300 కేలరీలు తగ్గించి ఫుడ్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. దీంతో వాళ్లకు బరువు పెరిగి, మజిల్ మాస్‌‌‌‌‌‌‌‌ తగ్గిందని తేలింది.

అలసట పెరుగుతుంది

రోజులో తీసుకోవాల్సిన దానికంటే తక్కువ తింటే తొందరగా అలసటకు గురవుతాం. తక్కువ కార్బోహైడ్రేట్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నవి  తింటే మన శరీరం తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. యానల్స్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌ మెడిసిన్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఒక రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో ఈ విషయాలు వెల్లడి చేసింది. అందుకే ఆహారంలో పిండిపదార్థాలు పూర్తిగా పక్కన పెట్టకూడదు. దానికి ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌, గుడ్‌‌‌‌‌‌‌‌ కార్బ్స్‌‌‌‌‌‌‌‌ను తీసుకోవాలి. దీంతో తొందరగా అలసిపోరు.

బలహీనంగా

డైటింగ్ పేరుతో ప్రతిరోజు ఉపవాసం ఉండేవారు తొందరగా అలసిపోవడమే కాకుండా ముందుముందు కొన్ని రోగాల బారిన పడే అవకాశం ఉంది. హార్వర్డ్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌ అభిప్రాయం ప్రకారం చాలా రోజులపాటు డైటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తే తలనొప్పి, బద్ధకం, ఆవేశం‌‌‌‌‌‌‌‌ లాంటివి పెరుగుతాయి.  అందుకే ‘ఆల్టర్నేట్‌‌‌‌‌‌‌‌ డే ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌’ లేదా ‘పీరియాడికల్‌‌‌‌‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌‌‌‌‌’ చేయడం మంచిది.

పోషకాలు అందవు

డైటింగ్‌‌‌‌‌‌‌‌ చేసేవాళ్ల కార్బ్స్‌‌‌‌‌‌‌‌, ఫ్యాట్స్‌‌‌‌‌‌‌‌, క్యాలరీల ఇన్‌‌‌‌‌‌‌‌టేక్‌‌‌‌‌‌‌‌ బాగా తగ్గిపోతుంది. దీంతో మనకు కావాల్సిన పోషకాలు అందవు. ఫైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌‌‌‌‌‌‌‌ లాంటివి శరీరానికి అందకపోవడం వల్ల చాలానే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

హెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాస్‌‌‌‌‌‌‌‌

తక్కువ క్యాలరీ ఫుడ్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటే హెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాస్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌  చెప్తున్నారు. డెర్మటాలజీ ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కాన్‌‌‌‌‌‌‌‌సెప్టువల్‌‌‌‌‌‌‌‌ జర్నల్‌‌‌‌‌‌‌‌ ప్రకారం సరైన తిండి తినకపోతే జుట్టు బలహీనమై, కొత్త జుట్టు రాదని తేలింది. పోషకాలు అందకపోవడం హెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌‌‌‌‌పై ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ చూపిస్తుంది.

ఈటింగ్‌‌‌‌‌‌‌‌ డిజార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బరువు తగ్గాలనే ఉద్దేశంతో డైటింగ్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసినప్పటకీ అది ముందుముందు ఈటింగ్‌‌‌‌‌‌‌‌ డిజార్డర్స్‌‌‌‌‌‌‌‌కు దారితీసే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఈటింగ్ డిజార్డర్స్ ప్రకారం డైటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నవారు 35 శాతం మంది కొన్ని రకాల ఫుడ్స్ తినడం పూర్తిగా
మానేసి పాథలాజికల్ డైటర్స్‌‌‌‌‌‌‌‌గా మారిపోతారు. మరో 20% కంటే ఎక్కువమంది ఈటింగ్‌‌‌‌‌‌‌‌ డిజార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లోనవుతారు.

Tagged balanced food, dieting, eat

Latest Videos

Subscribe Now

More News