
భారతీయ సంప్రదాయం ప్రకారం మాసాలన్నింటిలో కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉందని చెప్తారు. ప్రతి ఏడాది దీపావళి వెళ్లిన మరుసటిరోజు కార్తీక మాసం మొదలవుతుంది.చాంద్రమానం ప్రకారం శరదృతువులో వచ్చే రెండో మాసం ఇది. పౌర్ణమినాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి దీనిని కార్తీకమాసం అని పిలుస్తారు.
ఇది శివకేశవులకు మరింత అభిమానమైన నెలని అంటారు.ఈ నెలలో వచ్చే సోమవారాలు,చవితి, ఏకాదశి, ద్వాదశి,పౌర్ణమి... అత్యంత పవిత్రమైనరోజులని భక్తులు నమ్ముతారు.ఇంకా ఈ మాసంలో స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాసాలు, దీపారాధన, వనభోజనాలు చేయటం వల్ల అన్ని రకాల పాపాలు తొలిగి పోతాయని విశ్వసిస్తారు.
దీపారాధన
కార్తీకమాసంలో దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తోందని భక్తుల భావన. శివాలయా ల్లో గానీ, ఇంట్లో గానీ... ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే దేవుడి అనుగ్రహం లభిస్తుంద ని, పాపాలు పోతాయని చెప్తారు. ఉసిరికాయ పైన ఒత్తులు వెలిగిస్తే మంచిదని అంటారు. అలా కుదరని వాళ్లు నువ్వుల నూనె, నెయ్యితో వెలి గించినా శుభం జరుగుతుందని అంటారు.
ఇక కార్తీకమాసంలో సోమవారాలు, పౌర్ణమిరోజున శివాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి.. దీపాలతో శివారాధన చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. కార్తీకమాసం నెలరోజులు శివాలయా లలో ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. దీనిని ధ్వజ స్తంభానికి వేలాడ దీస్తారు కాబట్టి ఆకాశదీపం అని పిలుస్తారు. చిన్నచిన్న రంధ్రాలున్న గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి దీనిని వెలిగిస్తారు. ఈ దీపం ఆకాశ మార్గంలో వెళ్లే పితృదేవతల కోసమని నమ్ముతారు.
సోమవారాలు
కార్తీకమాసంలో సోమవారం చాలా పుణ్యఫ లమైందని శివపురాణం చెప్తుంది. చంద్రుడు సోమవారానికి అధిపతి. దేవతలలో మొదటి వాడైన అగ్ని, నక్షత్రాలలో మొదటిదైన కృత్తి కను అధిపతిగా చేసుకుని ఉంటాడు. అంటే సోమవారం చంద్రుడు సంపూర్ణంగా ఈ నక్షత్రం మీదే ఉంటాడన్నమాట.
శివునికి ఇష్టమైన సోమవారం చంద్రుడితో ముడిపడి ఉంటుంది. కాబట్టే కార్తీకమాసంలోని సోమవారాలకు అంత విశిష్టత!. సోమవారం రోజున వేకువజామునే నిద్రలేచి సముద్రస్నానం లేదా నదీస్నానం చేసి దీపారాధన చేసి శివుడ్ని ఆరాధిస్తే గొప్ప ఫలం లభిస్తుందని శివారాధకులు చెప్తారు.
కార్తీకమాస వ్రతం
కార్తీకమాసం శివ కేశవులు ఇద్దరికీ ముఖ్య మైంది. లక్ష్మీదేవికి విష్ణువు. పార్వతికి శివుడు కార్తీకమాస వ్రత మహాత్యాన్ని వివరించారట. ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో పార్వతీదేవి మానవులంతా కుల, మత, వర్ణ భేదం లేకుండా జరుపుకునే వ్రతం చెప్పమని అడిగిందట. అలాగే ఆ వ్రతం చేయటం వల్ల అష్టశ్వర్యాలు కలగాలని కూడా చెప్పిందట. అప్పుడు శివుడు ఈ వ్రతం గురించి వివరించా డని, ఇది స్కందపురాణంలో, ఉపపురాణంగా ఉందని అంటారు. అలాగే వశిష్ఠుడు జనకునికి ఈ వ్రత మహత్యం, విధానం గురించి చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి.
అందుకే కార్తీక మాసం హరిహరులకు మరింత ఇష్టమైంది.ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్లు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, ప్రవహించే నీళ్లలో స్నానం చేసి, తడిబట్టలతో గంగను, శివుడ్ని, విష్ణువును నీటితో ఆరాధించాలి.తర్వాత సూర్యుడికి నమ స్కరించి దేవాలయానికి వెళ్లాలి.దేవుడ్ని ప్రార్థించి పూజ చేయాలి. తర్వాత అక్కడే ఉన్న ఉసిరి చెట్టుకింద కూర్చొని కార్తీక పురాణం చదవాలి. సాయంత్రం సంధ్యావం దనం తర్వాత దీపారాధన చేయాలి. దేవునికి నైవేద్యం పెట్టి ఉపవాసాన్ని ముగించి ప్రసాదాన్ని తినాలి. దీనివల్ల అన్ని రకాల పాపాలు పోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు.
దానం
కార్తీకమాసంలో చేసే దానంవల్ల సర్వశుభాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ రోజుల్లో చేసే ఏ దానమైనా మంచిదేనట. దీపం, బంగారం, నవ ధాన్యాలు, అన్నం, మంచం... ఇలా ఏదైనా దానం ఇవ్వటం ఆచారంగా వస్తోంది.
వనభోజనాలు
కార్తీకమాసంలో వనభోజనాలు మరో ప్రధాన మైన ఆచారం. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఈ మాసంలో పౌర్ణమి రోజు వనభో జనాలు చేస్తారు. ఉసిరి చెట్టుకిందే భోజనం చేస్తారు.
ఎందుకంటే..! ఉసిరి చెట్టునీడ ఆరోగ్యా నికి మంచిది. అరటి ఆకులో భోజనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. వనభోజనాల వల్ల కుటుంబానికి మేలు జరుగుతుందని కూడా అంటారు.మానవుడు సంఘజీవి కాబట్టి ఇలాంటి సామూహిక కార్యక్రమాలు మానసిక, భౌతిక జీ వితానికి ఉపయోగపడతాయి. సంతోషాన్ని కలి గిస్తాయి. ఇక బంధువులు, స్నేహితులతో కలిసి వనభోజనాలకు వెళ్లడం వల్ల మనుషుల మధ్య ఆత్మీయతలు, అభిమానాలు పెరుగుతాయి.