
ప్రగతిభవన్ అధికార దుర్వినియోగ కేంద్రంగా మారిందన్నారు మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. ఒక్క బైపోల్ లో గెలిచేందుకు TRS వందల కోట్లు ఖర్చు పెడుతుందన్నారు. దొడ్డిదారిలో భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. హుజురాబాద్ లో హరీష్ రావు చేస్తున్నవన్నీ మోసాలు, అబద్ధాలేనన్నారు ఈటల. KCR అహంకారానికి, ధర్మానికి మధ్య పోరాటం జరుగుతుందన్నారు. అబద్దాల కోర్లు, అక్రమార్కులకు ప్రజల మద్దతు ఉండదన్నారు ఈటల. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు ఈటల. తనకు అండగా ఉండాలని కోరానన్నారు.