
టీఆర్ఎస్ లో కొంతమంది ఎమ్మెల్యేలు బానిసలు ఉంటున్నారని విమర్శించారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. వాళ్లంతా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రేపు వాళ్ల నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. కమలాపూర్ బీజేపీ నాయకులు,కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు ఈటల. హరీష్ రావు కేసీఆర్ మెప్పు పొందాలని చూస్తున్నారన్నాడు. హరీష్ మెప్పు పొందాలేరు కానీ.. ఆయనకు కూడా తన గతే పడుతుందన్నారు. ఇక్కడి మందిని తీసుకుపోవాలే దావత్ ఇయ్యాలే,డబ్బులు ఇయ్యాలే ఇదే హరీష్ రావు పని అన్నారు. సీఎస్, డీజీపీ చట్టానికి లోబడి పనిచేస్తున్నారా.. చుట్టంగా పనిచేస్తున్నారా చెప్పాలని ప్రశ్నించారు ఈటల.
ప్రాణాన్ని లెక్కచేయకుండా పోరాటం చేసిన గడ్డ హుజురాబాద్ అన్నారు. మంత్రులకు,ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ రాసి పంపించి మాట్లాడిపిస్తున్నారన్నారు.ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మంత్రులను చేసిన ఘనతే కేసిఆర్ దేనన్నారు.ఎన్ని కొట్లైనా ఖర్చు పెట్టి హుజురాబాద్ లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తుందన్నారు.