- కరీంనగర్ జిల్లాలో 86.58 శాతం , రాజన్న సిరిసిల్ల జిల్లాలో 84.41 శాతం
- పెద్దపల్లి జిల్లాలో 80.84, జగిత్యాలలో 78.34 శాతం
కరీంనగర్/వేములవాడ/పెద్దపల్లి/జగిత్యాల, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. పెద్దపల్లి జిల్లా మినహా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో మొదటి దశ ఎన్నికలను మించి రెండో దశ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల తరలింపు, స్వచ్ఛందంగా ఓటర్ల రాక పంచాయతీ ఎన్నికల్లో భారీగా పెరిగింది. కరీంనగర్ జిల్లాలో 86.58 శాతం , రాజన్న సిరిసిల్ల జిల్లాలో 84.41 శాతం, పెద్దపల్లి జిల్లాలో 80.84, జగిత్యాల జిల్లాలో 78.34 శాతం పోలింగ్ నమోదైంది.
కరీంనగర్ జిల్లాలో గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, చిగురుమామిడి మండలాల్లోని 111 గ్రామాల్లో మొత్తం 1,85,003 ఓటర్లకుగానూ 1,60,184 మంది ఓటర్లు(86.58శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిగురుమామిడి మండలంలో ఒక ట్రాన్స్ జండర్ ఓటు వేశారు. మొదటి దశ ఎన్నికల్లో 81.42 శాతమే పోలింగ్ నమోదుకాగా, ఈ సారి 5 శాతం ఓటింగ్ పెరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 84.41 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1,04,905 ఓటర్లలో 88,553 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పెద్దపల్లి జిల్లాలో రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ధర్మారం, జూలపల్లి, పాలకుర్తి, అంతర్గాం మండలాల పరిధిలోని 73 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. వీటి పరిధిలో మొత్తం 1,12,658 మంది ఓటర్లు ఉండగా, 94,807 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళలు 47,775, పురుషులు 47,029 ఉన్నారు.
జగిత్యాల జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో బీర్పూర్, జగిత్యాల, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాల పరిధిలో పోలింగ్ నిర్వహించారు. ఏడు మండలాల్లో మొత్తం 2,08,168 ఓటర్లు ఉండగా, 1,63,074 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో మొత్తం పోలింగ్ శాతం 78.34గా నమోదైంది. రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి.
కరీంనగర్
మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పోలింగ్‌శాతం
చిగురుమామిడి 34,370 29,498 85.82
గన్నేరువరం 17,430 15,435 88.55
మానకొండూర్ 56,922 49,328 86.66
శంకరపట్నం 37,867 33,334 88.03
తిమ్మాపూర్ 38,414 32,589 84.84
మొత్తం 1,85,003 1,60,184 86.58
జగిత్యాల జిల్లా
మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం
బీర్పూర్ 17,491 14,037 80.25
జగిత్యాల 9,727 7,904 81.26
జగిత్యాల(రూ) 45,021 34,976 77.69
కొడిమ్యాల 37,977 29,787 78.43
మల్యాల 40,307 31,060 77.06
రాయికల్ 37,959 30,031 79.11
సారంగాపూర్ 19,686 15,279 77.61
మొత్తం 2,08,168 1,63,074 78.34
పెద్దపల్లి జిల్లా
మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం
అంతర్గాం 17,930 15,445 86.40
ధర్మారం 42,447 32,076 82.88
జూలపల్లి 24,163 20,479 85.21
పాలకుర్తి 28,118 23,030 83.88
మొత్తం 1,12,658 91,076 84.15
రాజన్న సిరిసిల్ల జిల్లా
మండలం మొత్తంఓట్లు పోలైన ఓట్లు శాతం
బోయినిపల్లి 30,505 25,858 84.77
తంగళ్లపల్లి 38,468 32,111 83.47
ఇల్లంతకుంట 35,932 30,584 85.12
మొత్తం 1,04,905 88,553 84.41
