ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

V6 Velugu Posted on Jun 11, 2021

మాజీ మంత్రి ఈటల రాజేందర్ శనివారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు గన్‌పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్నారు. అనంతరం 11 గంటలకు తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో ఇవ్వనున్నారు. వారం కింద ఢిల్లీ వెళ్లొచ్చిన ఆయన.. ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. అందుకోసం ఈటల, బీజేపీ నేతలతో కలిసి హైదరబాద్ నుంచి ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లనున్నారు. 

Tagged Bjp, TRS, Telangana, Eatala Rajender, Huzurabad, Eatala resign

Latest Videos

Subscribe Now

More News