అవమానాలు నాకే కాదు.. హరీష్ రావు కూడా జరిగాయి

V6 Velugu Posted on Jun 04, 2021

తనకు జరిగినటువంటి అవమానాలు తనకే కాకుండా.. తోటి మంత్రి హరీష్ రావుకు జరిగాయాని మాజీ మంత్రి ఈటల అన్నారు. టీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేయబడిన ఈటల రాజేందర్ శుక్రవారం తన పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో తన నియోజకవర్గంలో ఒక సమస్య వస్తే జిల్లా ఎమ్మెల్యేలంతా తన దగ్గరికి వచ్చారని ఆయన అన్నారు. ఆ తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం ఫాం హౌజ్‌కు వెళ్తే.. పోలీసులు కనీసం లోపలికి కూడా వెళ్లనివ్వలేదని ఆయన అన్నారు. ఇలాంటి అవమానం తనకే కాకుండా.. మంత్రి హరీష్ రావుకు కూడా అనుభవమేనని ఈటల అన్నారు. ఇలాంటి అనమానాలు జరిగినప్పుడు పడిన బాధ ఎవరూ మరచిపోరని ఆయన అన్నారు.

Tagged Telangana, Karimnagar, CM KCR, Minister Harish rao, Eatala Rajender, KCR Farmhouse, Eatala resign

Latest Videos

Subscribe Now

More News