కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు నాకు తెలుసు

కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు నాకు తెలుసు

కేసీఆర్ తలుచుకుంటే అవతలి వ్యక్తి పరిస్థితి ఏంటో తనకు తెలుసన్నారు మాజీ మంత్రి ఈటెల. కేసీఆర్ కక్షసాధింపు చర్యలు ఎలా ఉంటాయో 19 ఏళ్లుగా తాను దగ్గరుండి చూశానన్నారు. దమ్ముంటే తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని సవాల్ విసిరారు. చావునైనా బరిస్తా... కానీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టనన్నారు. పదవుల కోసం పెదవులు మూసే వ్యక్తిని కాదన్నారు. మంత్రులుగా కాకున్నా..కనీసం మనుషులుగా గుర్తించాలన్నారు. కేసీఆర్ దగ్గర ఏ ఒక్క మంత్రి కూడా ఆత్మ గౌరవంతో లేరన్నారు. కేసీఆర్ చట్టాన్ని, సిస్టమ్ ను పక్కన పెట్టి పని చేస్తున్నారని విమర్శించారు.తనను అరెస్ట్ చేసి ఎన్ని రోజులు జైల్లో పెడతారో పెట్టాలన్నారు. అసెంబ్లీలో పేగులు బయట పడేలా తెలంగాణ కోసం కొట్లాడనన్నారు.  

సివిల్ సప్లైలో కూడా అక్రమాలు జరిగాయని మున్ముందు తనపై ఆరోపణలు చేయొచ్చన్నారు. ఈటల ప్రేమకు లొంగిపోయే వాడు కానీ..ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే సహించనన్నారు. ఇప్పుడు తన మీద ఏ కేసు పెట్టినా వెనక్కి తగ్గనన్నారు. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంటానన్నారు. తన వ్యాపార టర్నోవర్ సంవత్సరానికి రూ. 300 కోట్లని అన్నారు. 14 ఏళ్లుగా తమ్ముడి ఉండి దెయ్యం ఎలా అయ్యిండని ప్రశ్నించారు.  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమన్నారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానన్నారు.