Good Health : ఈ ఫుడ్ తింటే టెన్షన్, ఒత్తిడి తగ్గుతాయి..

Good Health : ఈ ఫుడ్ తింటే టెన్షన్, ఒత్తిడి తగ్గుతాయి..

పంచవ్యాప్తంగా చాలామంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని లాన్సెట్ అనే మెడికల్ జర్నల్ లో ఈ మధ్య వచ్చిన ఒక రిపోర్ట్ చెబుతోంది. డిప్రెషన్ లో ఉన్నవాళ్లు ఎక్కువగా తింటారు. అయితే సరైన ఫుడ్ తింటే డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు అంటున్నారు చీఫ్ డైటీషియన్, న్యూట్రిషనిస్టు ఎన్. మల్లీశ్వరి.

పోషకాహారం తినకపోవడం వల్ల ట్రిప్టోఫాన్, టైరోసిన్, మిథియోనిన్, ఫిలైన్ అలనిన్ వంటి కొన్ని రకాల అమైనో ఆమ్లాలు శరీరానికి అందవు. ఈ అమినో యాసిడ్స్ డిప్రెషన్ తో పాటు కొన్నిరకాల డిజార్డర్లని తగ్గిస్తాయి. 

డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ఒమెగా-3 -ఫ్యాటీయాసిడ్స్ ఉన్న సాల్మన్ చేపలు, సీఫుడ్ తినాలి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి ఉన్న పండ్లు, కూరగాయలు ఫ్రీరాడికల్స్ ని తగ్గించి, మెదడును చురుకుగా మారుస్తాయి. 

క్యారెట్, గుమ్మడి, సంత్రాలు, టొమాటోలు, నట్స్, సీడ్స్ వంటివి ఫ్రీ రాడికల్స్ ని తొలగించడంలో సాయపడతాయి. చికెన్, బీన్స్, బఠాణి గింజలు, సోయాగింజలు కూడా డిప్రెషన్ నుంచి బయటపడేస్తాయి అన్నారు.

Also Read :- చలికాలంలో జలుబు, దగ్గు తగ్గాలంటే వీటిని తినాలి