జనసేన గాజు గ్లాస్ గుర్తుపై ఈసీ సంచలన నిర్ణయం...

జనసేన గాజు గ్లాస్ గుర్తుపై ఈసీ సంచలన నిర్ణయం...

జనసేన గాజు గ్లాస్ గుర్తు విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేస్తూనే.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు కల్పించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి కామన్ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తును కేటాయించనుంది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ ను గుర్తించినందున కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే విధానాన్ని అవలంభించనుంది. ఇక నుంచి జనసేన అభ్యర్థులు ఎక్కడ నుంచి పోటీ చేసినా వారికి ఇదే గుర్తును కేటాయిస్తారు. వచ్చే ఎన్నికల్లో కామన్ సింబల్ గా గాజు గ్లాస్ నిలవనుంది. తాజాగా ఈసీ చెప్పిన ఈ వార్తతో.. జనసేనకు బిగ్ రిలీఫ్ లభించింది. వైసీపీ, టీడీపీ మాత్రమే రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:రాష్ట్ర బీజేపీపై అధిష్టానం ఫోకస్.. హుటాహుటీన ఢిల్లీకి కిషన్ రెడ్డి

అయితే, గత ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీ పొందే ఓట్లు, సీట్లు రానందు వల్లే జాతీయ ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ కేటగిరిలో జనసేన గాజు గ్లాస్ గుర్తును చేర్చింది. కేవలం నిబంధనలను అనుసరించే అలా చేశారు. ఆ గుర్తును ఇక నుంచి వేరే పార్టీలకు ఇచ్చే ఛాన్స్ లేదు. జనసేన రిక్వెస్ట్ ప్రకారం ఆ పార్టీ అభ్యర్థులందరికీ కామన్ సింబల్ గా గాజు గ్లాసునే కేటాయించనున్నారు. 

మరో ఐదు జాతీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న 11 పార్టీలకు ఈసీ గుర్తులను కేటాయించింది. ఆమ్ ఆద్మీని జాతీయ పార్టీగా, సీపీఐ, ఎన్ సీపీలను రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలుగా గుర్తించింది. రాష్ట్ర పార్టీల జాబితాలో ఉన్న ఆర్ఎల్ డీని రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చింది. అయితే ఈ పార్టీకి ఎలాంటి గుర్తుని కేటాయించలేదు. ఇక బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కేఆర్ బీహెచ్ఎన్ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు.