‘సర్‌‌‌‌‌‌‌‌’ గడువు వారం పొడిగింపు.. మొత్తం షెడ్యూల్‌‌‌‌ను రివైజ్‌‌‌‌ చేసిన ఈసీ

‘సర్‌‌‌‌‌‌‌‌’ గడువు వారం పొడిగింపు..  మొత్తం షెడ్యూల్‌‌‌‌ను రివైజ్‌‌‌‌ చేసిన ఈసీ

న్యూఢిల్లీ: దేశంలో రెండో విడతలో చేపడుతున్న  ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌‌‌‌‌‌‌‌) గడువును ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ (ఈసీ) మరో వారంపాటు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఓటర్లు తమ పేర్లను ఎలక్టోరల్‌‌‌‌ రోల్స్‌‌‌‌లో తనిఖీ చేసుకొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.  రెండో దశలో చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, గోవా, గుజరాత్‌‌‌‌, కేరళ, మధ్యప్రదేశ్‌‌‌‌, రాజస్తాన్​, తమిళనాడు, యూపీ, వెస్ట్ బెంగాల్‌‌‌‌సహా అండమాన్‌‌‌‌ నికోబార్‌‌‌‌ దీవులు, లక్షద్వీప్‌‌‌‌, పుదుచ్చేరి.. మొత్తం 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నది. 

కొత్త షెడ్యూల్​ ప్రకారం.. ఎన్యుమరేషన్​ప్రక్రియ గడువు డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 4 నుంచి డిసెంబర్​11కి మారింది. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ డిసెంబర్ 9కి బదులుగా డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 16న ప్రచురిస్తారు.  తుది ఓటర్ల జాబితా 2026  ఫిబ్రవరి 7కి బదులుగా ఫిబ్రవరి 14న రిలీజ్​ అవుతుంది. సర్‌‌‌‌‌‌‌‌ కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులతో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.  సర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ కొనసాగుతుండగా.. గడువు ఒత్తిడి తట్టుకోలేక 40 మంది బూత్‌‌‌‌స్థాయి అధికారులు (బీఎల్వోలు) మరణించారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఈసీ ఖండించింది.