నేషనల్ రికార్డ్: నిజామాబాద్ లో 36 కౌంటింగ్ టేబుళ్లు

నేషనల్ రికార్డ్: నిజామాబాద్ లో 36 కౌంటింగ్ టేబుళ్లు

నిజామాబాద్ లోక్ సభ స్థానానికి కౌంటింగ్ నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేసినట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. ఇక్కడ 185 మంది ఎన్నికల బరిలో నిలవడం దేశంలో చర్చనీయాంశం అయింది. మామూలుగా అయితే నిజామాబాద్ లో 14 టేబుళ్లతో కౌంటింగ్ ను నిర్వహించేవారు. అయితే 186 మంది (నోటా తో కలిపి) పోటీచేసే సరికి 36 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఒక లోక్ సభ స్థానం ఓట్ల లెక్కింపుకు ఇన్ని టేబుళ్లను ఉపయోగించడం దేశంలోనే మొదటిసారి.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును నిజామాబాద్ లో ఏర్పాటు చేశారు. మరో 2 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జగిత్యాలలో నిర్వహించనున్నారు. రౌండ్ రౌండ్ కు ఫలితాన్ని.. నిజామాబాద్ నుంచే ప్రకటిస్తారు. ఈవీయంల సంఖ్యతో పాటూ ప్రతీ ఈవీయంలో 5 స్లిప్పులు లెక్కపట్టాల్సి ఉండాటంతో ఒక్కో నియోజక వర్గానికి సుమారు ఒక గంట సమయం పట్టనుంది.