
కరీంనగర్ క్రైం,వెలుగు: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జోన్ తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ మంగళవారం ముగిసింది. ఇందులో ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహించగా.. విజేతలకు బహుమతులు అందించారు. సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ లో గంగాధర పీఎస్ ఎస్ ఐ వంశీకృష్ణ ( గోల్డ్ మెడల్), కామారెడ్డి జిల్లా గాంధారి పీఎస్ ఎస్ఐ ఆంజనేయులు ( సిల్వర్ ), కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లోని కేశపట్నం పీఎస్ ఎస్ఐ శేఖర్ రెడ్డి ( బ్రాంజ్ ) గెలిచారు. డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్ లో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన డాగ్ హ్యాండ్లర్, పోలీస్ కానిస్టేబుల్ జి శంకర్ ( గోల్డ్), రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన డాగ్ హ్యాండ్లర్ పోలీస్ కానిస్టేబుల్ జి. శ్రీనివాస్ (సిల్వర్ మెడల్ సాధించారు.
కంప్యూటర్ అవేర్ నెస్ లో మెదక్ జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఎస్. సతీశ్‌కుమార్ (గోల్డ్ ), కరీంనగర్ కమిషనరేట్ కానిస్టేబుల్ ఎం. సతీశ్‌కుమార్ ( సిల్వర్ ), కామారెడ్డి జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఎ. చిరంజీవి (బ్రాంజ్) గెలుపొందారు. ఫొటోగ్రఫీలో మెదక్ జిల్లాకు చెందిన ఎం. శ్రీధర్ గౌడ్ (గోల్డ్ ), మెదక్ జిల్లాకు చెందిన కె. శ్రీధర్ (సిల్వర్) గెలుపొందారు.
కరీంనగర్ కమిషనరేట్ కానిస్టేబుల్ మల్లేశం ( బ్రాంజ్ ) సాధించారు. వీడియోగ్రఫీలో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ గౌడ్( గోల్డ్ ), అదే జిల్లాకు చెందిన కానిస్టేబుల్ కె. శ్రీధర్ (సిల్వర్) మెడల్స్ సాధించారు. యాంటీ సాబెటేజ్ చెక్ లో కరీంనగర్ కమిషనరేట్ కానిస్టేబుళ్లు సంతోవ్, వి. వెంకటేశ్ ( గోల్డ్ ) , మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఎస్. రవీందర్, జై నర్సింహులు (సిల్వర్) సాధించారు. వీరిని వరంగల్ లో రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ పోటీలకు పంపించనునున్నట్టు సీపీ గౌస్ ఆలం తెలిపారు.