ఎక్స్ సంచలన ప్రకటన.. 2,355 ఖాతాలపై నిషేధం !

ఎక్స్ సంచలన ప్రకటన.. 2,355 ఖాతాలపై నిషేధం !

న్యూఢిల్లీ: అమెరికా బిలియనీర్​ ఎలాన్ మస్క్​ సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్ ఎక్స్  ఒక సంచలన ప్రకటన చేసింది. భారత ప్రభుత్వం 2,355 ఖాతాలను నిషేధించాలని ఆదేశించిందని, ఇందులో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఖాతా కూడా ఉందని వెల్లడించింది. 

ఈ ఆదేశాలు జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని జారీ అయ్యాయని సమాచారం. బ్యాన్​ చేసిన ఖాతాలలో రాయిటర్స్ ప్రధాన ఖాతాతో పాటు, కొందరు ప్రముఖులు,  ఇతర అంతర్జాతీయ వార్తా సంస్థల ఖాతాలు కూడా ఉన్నాయి.  

కేంద్రం మాత్రం ఎక్స్​ ప్రకటనను తోసిపుచ్చింది. తాము కొత్తగా ఖాతాల బ్లాకింగ్​కు ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. రాయిటర్స్​ ఖాతాను పునరుద్ధరించాలని ఎక్స్​ను కోరామని పేర్కొంది.