
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ, వెలుగు: దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఈసీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. బెంగాల్ లో 4, హిమాచల్ ప్రదేశ్ లో 3, ఉత్తరఖండ్ లో 2, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ ల్లోని ఒక్కో స్థానంలో ఎన్నికలు జరగనున్నాయని తెలిపింది.
అందుకు సంబంధించిన షెడ్యూల్ ను జూన్ 14న రిలీజ్ చేయనున్నట్టు చెప్పింది. జూన్ 21న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని, జూన్ 24న నామినేషన్ల పరిశీలనకు చివరితేది, జూన్ 26న వాటి విత్ డ్రాకు చివరి తేదిగా పేర్కొంది. ఈ స్థానాలకు జులై 10న పోలింగ్ జరగనుందని వెల్లడించింది. జులై 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని వివరించింది.