Ashes 2025-26: యాషెస్ రెండో టెస్టుకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ప్రకటన.. 150 కి.మీ ఫాస్ట్ బౌలర్ దూరం

Ashes 2025-26: యాషెస్ రెండో టెస్టుకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ప్రకటన.. 150 కి.మీ ఫాస్ట్ బౌలర్ దూరం

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. గురువారం (డిసెంబర్ 4) బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ కు పింక్ బాల్ ఉపయోగించనుండడంతో ఈ మ్యాచ్ అభిమానులకి ప్రత్యేక అనుభూతిని కలిగించనుంది. రెండో టెస్టులో గెలిచి సిరీస్ పై పట్టు సంపాదించాలని ఆస్ట్రేలియా భావిస్తుంటే.. ఇంగ్లాండ్ సిరీస్ ను సమం చేసే ప్రయత్నంలో ఉంది. రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. 

రెండో టెస్టుకు మరో రెండు రోజులు ఉండగానే ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ ను ప్రకటించింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయం కారణంగా స్పీడ్ బౌలర్ మార్క్ వుడ్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొలి టెస్ట్ సమయంలో మార్క్ వుడ్ ఎడమ మోకాలికి గాయమైంది. మార్క్ వుడ్ స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ ను ఇంగ్లాండ్ తుది జట్టులోకి తీసుకుంది. వుడ్ లేకపోయినా ఇంగ్లాండ్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడాన్ కార్స్, గస్ అట్కిన్సన్ లతో బలంగా కనిపిస్తోంది. జో రూట్, విల్ జాక్స్ రూపంలో ఇంగ్లాండ్ కు స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించాల్సి ఉంది. 

యాషెస్ రెండో టెస్టుకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11: 

బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్

తొలి టెస్టులో ఇంగ్లాండ్ గ్రాండ్ విక్టరీ: 

పెర్త్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లాండ్ ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోక విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (83 బంతుల్లోనే 123) సెంచరీతో చెలరేగి జట్టుకు వేగంగా గెలుపును అందించాడు. మార్నస్ లాబుస్చాగ్నే (51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 4న జరుగుతుంది.