ENG vs PAK: పాక్ క్రికెటర్లపై దాడులు జరిగే ఛాన్స్.. అప్రమత్తమైన ఇంగ్లండ్ పోలీసులు

ENG vs PAK: పాక్ క్రికెటర్లపై దాడులు జరిగే ఛాన్స్..  అప్రమత్తమైన ఇంగ్లండ్ పోలీసులు

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ జట్టుపై దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు రావడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ అప్రమత్తమయ్యింది. ఆటగాళ్లకు భద్రత పెంచాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)ను అభ్యర్థించింది. అందుకు ఆతిథ్య బోర్డు వెంటనే అంగీకరించి భారీ భద్రత కల్పిచింది. 

అసలేం జరిగింది..?

గత కొంతకాలంగా దాయాది జట్టు పేలవ ప్రదర్శన కనపరుస్తోంది. ఇంటా.. బయటా అన్ని ఓటములే ఎదురువుతున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటములు మరవకముందే.. ఐర్లాండ్ పర్యటనలో తొలి మ్యాచ్‌లోనే ఓడారు. ఆ తరువాత పుంజుకొని సిరీస్ గెలిచినప్పటికీ.. అది ఆ దేశ అభిమానులకు సంతృప్తినివ్వలేదు. ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్ గడ్డపై అలాంటి ప్రదర్శనే చేస్తున్నారు. దీంతో పాక్ అభిమానులు వారిపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు ఆఫ్ఘన్ ఫ్యాన్స్ వీరిపై గుర్రుగా ఉన్నారట. ఇప్పటికే మాటల తూటాలు మొదలుపెట్టిన ఆఫ్ఘన్లు.. అవకాశం దొరికితే దాడి చేయడానికి సిద్ధమైనట్లు నివేదికలు వచ్చాయి. దీంతో పాక్ క్రికెట్ బోర్డు వెంటనే అప్రమత్తమై ఆటగాళ్ల రక్షణ పట్ల చర్యలు తీసుకుంది.

Also read :T20 World Cup 2024: ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరుతుంది.. వెస్టిండీస్ దిగ్గజం జోస్యం

రెండు మ్యాచ్‌లు వర్షార్పణం

నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా తొలి, మూడో టీ20లు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. చివరి టీ20 మే 30న లండన్‌లోని ఓవల్‌ వేదికగా జరుగుతుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో తలపడే ముందు ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్.