
- ఈసీఐఎల్ ప్రతినిధులను అభినందించిన కలెక్టర్
ములుగు, వెలుగు: ఈసీఐఎల్ హైదరాబాద్ ప్రతినిధులు సీఎస్సార్‌లో భాగంగా ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి రూ.20 లక్షల విలువైన సీ ఆర్మ్ మెషీన్, ఓట్ లైట్, ఫ్రాక్చర్ టేబుల్ ను కలెక్టర్ దివాకర టి.ఎస్. చేతులమీదుగా గురువారం అందజేశారు. వారిని కలెక్టర్అభినందించారు.
భవిష్యత్‌లోనూ హాస్పిటల్‌కు ఉపయోగపడే పనులు చేయడానికి ముందుకు రావాలని కోరారు. సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్, ఈసీఐఎల్ ప్రతినిధులు మురళీధర్, సుధాన్షు కుమార్, రంజన్ శ్రీవాస్తవ, డాక్టర్ వేణు బాబు, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధి కుమార్ తదితరులు పాల్గొన్నారు.