లిక్కర్ కేసు అప్ డేట్: కవితకు ఎదురు దెబ్బ

లిక్కర్ కేసు అప్ డేట్:  కవితకు ఎదురు దెబ్బ

 

  • పరిగణనలోకి ఈడీ అనుబంధ చార్జిషీట్ 

  • జూన్ 3న విచారణకు రావాలని సమన్లు

  • నిందితులంతా రావాలన్న ప్రత్యేక కోర్టు

ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుంది. జూన్ 3న చార్జిషీట్ లో పేర్కొన్న నిందితులందరూ కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో వచ్చే నెల 3న కవితను జైలు అధికారులు కోర్టులో పెట్టనున్నారు. 

Also read :నా పేరు చెప్పుకుని తప్పుడు పనులు చేస్తే సహించ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

తన వద్ద విచారణకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని ఈడీ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత న్యాయమూర్తి కావేరి భవేజా ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. మరో వైపు కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్డు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు. ఈ క్రమంలో రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకొని ఇందులో నిందితులుగా ఉన్న వారందరిని విచారణకు పిలవడం హాట్ టాపిక్ గా మారింది.