నా పేరు చెప్పుకుని తప్పుడు పనులు చేస్తే సహించ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

నా పేరు చెప్పుకుని తప్పుడు పనులు చేస్తే సహించ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

తన పేరు చెప్పుకొని ఎవరు కూడా తప్పుడు పనులు చేస్తే సహించేది లేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చెన్నూరు  రైతులు నియోజకవర్గవ్యాప్తంగా జూలైలోనే నాట్లు వేయాలని ఆయన కోరారు. సన్న వడ్లను ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుందని, రైతులు సన్న వడ్లు పండించి లాభాలు ఆర్జించాలన్నారు. సన్న వడ్లు పండిస్తే ఏమైనా సమస్య లు ఉంటే వారికి తాను అవగాహన కల్పిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ నేను రైతులకు అండగా ఉంటానని ఆయన చెప్పారు. 

మంచిర్యాల జిల్లాలో లక్ష ఇరువై  ఐదు వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామన్నారు. 12 వేల 600 మంది రైతులకు పూర్తిగా పేమెంట్స్ పూర్తయ్యాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా ఏ ఇబ్బంది లేదన్నారు. తాను సర్జరీ కోసం అమెరికా వెళ్లానని, అక్కడి నుంచే సివిల్ సప్లై కమి షనర్ తో మాట్లాడిరైతులకు ఇబ్బంది కల గకుండా పెద్దపల్లికి వడ్ల దిగుమతి కోసం పర్మిషన్ తీసుకున్నానని తెలిపారు. ప్రత్యే కంగా పెద్దపల్లి మిల్లులకు చెన్నూర్ రైతులు వడ్లను దిగుమతి చేశామని, సుల్తానాబాద్ లో మిల్లర్లతో మాట్లాడి కోత విధించవద్దని కోరినట్లు చెప్పారు. 

Also read :రైతులకు గుడ్ న్యూస్ : నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్...

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మిల్లర్లకు ఆదేశాలు ఇచ్చి కటింగ్ లేకుండా చూస్తున్నామన్నారు. చివరి గింజ వరకు వడ్లను కొనుగోలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రైతుల గురించి బీజేపీ నాయకులు కల్ల బొల్లి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మోదీ ప్రభుత్వం గోడౌన్స్ తక్కువ చేయడంతో ఇబ్బందులు ఎదు రవుతున్నాయన్నారు. బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి గోడౌన్ లు పెంచేలా చూడాలని సూచించారు.