
ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భఘేల్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎంకు 508 కోట్ల రూపాయలు చెల్లించారని ఆరోపించారు ఈడీ అధికారులు. క్యాష్ కొరియర్ గా పని చేస్తున్న అసిమ్ దాస్ నుంచి 5.39 కోట్ల రూపాయలను ఈడీ స్వాధీనం చేసుకుంది. అతని బినామీ ఖాతాల్లో 15.59 కోట్లు జమ చేసినట్లు అధికారులు గుర్తించారు. కాగా.. మహాదేవ్ యాప్ బెట్టింగ్ కేసులో ఈడీ ఇప్పటికే తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కేసుకు సంబంధించి యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ సహా 14 మంది నిందితులుగా ఉన్నారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, నవంబర్ 17న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.