చైనా యాప్ ల కేసులో CA రవికుమార్ అరెస్ట్

V6 Velugu Posted on Dec 03, 2021

చైనా యాప్స్‌ కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ED)దర్యాప్తు ముమ్మరం చేసింది. ఢిల్లీకి చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ (CA) రవికుమార్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఫోర్జరీ ఎయిర్‌వే బిల్లులతో రూ.1100 కోట్లను  అక్రమంగా చైనాకు తరలించినట్లు  ED అధికారులు గుర్తించారు. బోగస్ బిల్లుల జారీలో CA రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. రవికుమార్‌ను నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా.. రేపటి నుంచి ఈ నెల 9వరకూ ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. నకిలీ బిల్లులకు సంబంధించి డొల్ల కంపెనీ నిర్వాహకులు పరారీలో ఉన్నారని.. గేమింగ్, డేటింగ్ యాప్‌ల పేరుతో వేల కోట్లు దేశం దాటించినట్లు ఈడీ అధికారులు చెప్పారు.

Tagged ED arrests, CA Ravikumar, China apps case

Latest Videos

Subscribe Now

More News