అక్రమ ఇసుక తవ్వకాల కేసులో లాలూ యాదవ్ సన్నిహితుడు అరెస్టు

అక్రమ ఇసుక తవ్వకాల కేసులో లాలూ యాదవ్ సన్నిహితుడు అరెస్టు

బీహార్‌లో అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు సుభాష్ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం రాత్రి అరెస్టు చేసింది. ఆదివారం ఉదయం సుభాష్ యాదవ్‌ను కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. సోమవారం పాట్నాలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) ప్రత్యేక కోర్టులో ఆయనను హాజరుపరచనున్నారు. శనివారం లాలూ ప్రసాద్ యాదవ్ తో సంబంధం ఉన్న పలువురి నివాసాల్లో 14 గంటలపాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ రైడ్స్ లో దాదాపు రూ.2.3 కోట్ల నగదును గుర్తించిన అధికారులు.. సుభాష్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 సుభాష్ యాదవ్‌ డైరెక్టర్ గా బ్రాడ్‌సన్స్ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ.. ఈ చలాన్లను ఉపయోగించకుండా అక్రమ మైనింగ్ ఇసుక విక్రయాలకు పాల్పడుతున్నారనే ఆరోణలు రావడంతో..  బీహార్ పోలీసులు, కంపెనీపై20 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి  మనీలాండరింగ్ కేసులో విచారణ జరిపిన ఈడీ..దాదాపు రూ.161 కోట్ల మేర అక్రమ ఆదాయాన్ని గుర్తించారు.