కేజ్రీవాల్కు మార్చి 28 వరకు ఈడీ కస్టడీ

కేజ్రీవాల్కు మార్చి 28 వరకు ఈడీ కస్టడీ

లిక్కర్ పాలసీ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఆరు రోజుల పాటు  కస్టడీ విధించింది స్పెషల్ సీబీఐ కోర్టు. కేజ్రీవాల్కు మార్చి 28 వరకు కస్టడీ విధిస్తూ స్పెషల్ సీబీఐ న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశాలు జారీ చేశారు. మార్చి 28 మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి కోర్టులో హాజరు పర్చాలని ఆదేశించారు. 

నిన్న అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను శుక్రవారం రౌస్ ఎవెన్యూ కోర్టు కాంప్లెకస్ లోని స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జిముందు హాజరుపర్చారు ఈడీ అధికారులు. ప్రీవెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్టు ప్రకారం.. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్లు బెంచ్ కు వివరించారు ఈడీ తరపు న్యాయవాదులు. 28 పేజీల రిమాండ్ రిపోర్టును అందించారు. కేజ్రీవాల్ ను పదిరోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది ఈడీ. వాదనల అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఆరు రోజు ల కస్టడీ విధించిందిస్పెషల్ సీబీఐ కోర్టు.

లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కింగ్ పిన్ లా వ్యవహరించారని ఈడీ కోర్టు తెలిపింది. శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు కు 28 పేజీలు రిమాండ్ రిపోర్టును అందించింది. ఇది రూ. 100 కోట్ల కుంభకోణం కాదని.. మొత్తం 600 కోట్ల కుంభకోణం అని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కేజ్రీవాల్ పాత్రపై తమ కస్టడీలో ఉన్న తెలంగాణ ఎమ్మెల్యే కవిత వాంగ్మూలాన్ని రికార్డు చేశామని రిపోర్టులో వెల్లడించింది. రూ. 45 కోటలను హవాలా ద్వారా గోవాకు పంపారని తెలిపింది. నాలుగు రూట్ల ద్వారా ఈ డబ్బును గోవాకు చేర్చారని వివరించింది. విజయ్ నాయర్ కంపెనీ నుంచి అన్ని ఆధారాలను సేకరించామని తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాలున్నాయని తెలిపింది. ఆప్ కు సౌత్ గ్రూప్ నకు మధ్య విజయ్ నాయర్ వారధిగా ఉన్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది ఈడీ.