ఢిల్లీ లిక్కర్‌‌‌‌ స్కామ్​ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్‌‌‌‌ స్కామ్​ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్‌‌‌‌ స్కాం​ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో సమీర్ మహేంద్రును ఏ1గా పేర్కొంది. ఏ2, ఏ3, ఏ4, ఏ5గా 4 కంపెనీల పేర్లు చేర్చింది. రౌస్ అవెన్యూ కోర్టులో దాదాపు 3వేల పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ సాఫ్ట్ కాపీతో కూడిన హార్డ్ డిస్క్ సహా డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టైన వారిపై కూడా త్వరలోనే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు చెప్పింది. అనంతరం న్యాయమూర్తి కేసు విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేశారు. లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెప్టెంబర్ 27న సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసింది. 

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన మరో నిందితుడు విజయ్ నాయర్ రెండ్రోజుల కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆయనను కోర్టులో హాజరు పరచారు. మనీలాండరింగ్లో విజయ్ నాయర్ పాత్ర ఉందని కోర్టుకు వివరించారు.  కస్టడీ ముగియడంతో సీబీఐ స్పెషల్ కోర్టు విజయ్ నాయర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.