పీఎఫ్ఐకి గల్ఫ్ నుంచి భారీగా ఫండింగ్ ?

పీఎఫ్ఐకి గల్ఫ్ నుంచి భారీగా ఫండింగ్ ?
  •  పీఎఫ్ఐ కేసులో కొనసాగుతోన్న ఎన్ఐఏ, ఈడీ దర్యాప్తు 
  • విదేశాల్లో స్వచ్ఛంద సంస్థ పేరుతో నిధులు వసూలు చేసినట్లు గుర్తింపు

న్యూఢిల్లీ:  పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. విదేశాల్లోనూ స్వచ్ఛంద సంస్థ పేరుతో నిధులు వసూలు చేసినట్లు గుర్తించింది. 120 కోట్ల నిధులపై కూపీ లాగుతున్నారు అధికారులు. అబుదాబిలో ఉన్న దర్బార్ హోటల్ లో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా తేజస్ అనే పేపర్ ను పీఎఫ్ఐ నడిస్తోంది. తేజస్ కు డైరెక్టర్ గా పనిచేస్తోన్న కేరళ పీఎఫ్ఐ నేత షఫిక్ ను పోలీసులు మూడ్రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ భారీగా వసూలు చేసినట్లు గుర్తించారు. గల్ఫ్ నుంచి భారీగా ఫండింగ్ జరిగినట్లు వెలుగులోకి రావడంతో ఎన్ఐఏతో పాటు ఈడీ, ఆయా రాష్ట్రాల పోలీసులతో దర్యాప్తు చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నిజామాబాద్ లో 200 మంది యూత్ కు పీఎఫ్ఐ నాయకుడు అబ్దుల్ ఖధీర్ శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. అయితే కేరళలోనే ఎక్కువ శాతం మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్, నిజామాబాద్ లో అరెస్టైన కార్యకర్తలను ఈడీ కస్టడీకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.